మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్యాంకులకు రుణాలు కట్టాల్సి వస్తోందని కార్మికులకు జీతాలు చెల్లించాల్సి వస్తుందని ట్రావెల్స్ బోర్డు తిప్పేసి, కొన్ని “వేల కోట్లకు పంగనామం” పెట్టిన నువ్వా ఇలాంటి నీతులు చెబుతుంది. ఎవరెవరికి ఏం చేయాలో, ఏ పరిశ్రమలను ఏపీకి ఎలా తీసుకురావాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా తెలుసు. మధ్యలో నీ ఉపన్యాసాలు వినే తీరిక, నీతో చెప్పించుకునేంత ఖర్మ చంద్రబాబుకి లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కన చేరావ్ అని ప్రజలు నిన్ను చీ కొట్టారు.. మర్చిపోయావా అంటూ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.




