బన్నీ వాసు మాటలకి విలువుందా ?

Bunny Vasu Comments On Ap Nandi Awards

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నంది అవార్డుల మీద విమర్శలు రావడం కొత్త కాదు. ఈసారి మూడేళ్ళ నంది అవార్డుల ప్రకటన రాగానే అలాగే జరిగింది. బాలయ్య లెజెండ్ కి ఇన్ని అవార్డులు రావడం మీద విమర్శలు ఒక ఎత్తు అయితే బన్నీ వాసు చేసిన సెటైర్ భలే పేలింది. మెగా హీరోలు ఏపీ సర్కార్ దగ్గర నటన నేర్చుకోవాలి అని బన్నీ వాసు కామెంట్ తో ఒక్క సారిగా హీట్ పెరిగింది. మెగా క్యాంపు కి అవార్డులు రాలేదన్న కడుపు మంట ఆ మాటల్లో కనిపించింది. కానీ ఒక్క విషయం. మొత్తం మెగా ఫ్యామిలీ హీరోల భవిష్యత్ కి పునాది రాళ్లు ఎత్తిన చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు రావడాన్ని బన్నీ వాసు ఎలా మర్చిపోయారో ఏమో.
బన్నీ వాసు ఆవేదన మంచి నటులకు అవార్డులు రాలేదనా లేక మెగా హీరోలకు రాలేదనా ?. తాను ఎవరికి అన్యాయం జరిగిందని భావిస్తున్నాడో సదరు హీరో, ఇప్పుడు అవార్డు వచ్చిన హీరో కన్నా ఆ సినిమాలో బాగా చేసాడని చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడు ఈ విమర్శకి ఓ అర్ధం ఉండేది. బన్నీ వాసు చెప్పిన మాటల్లో నిజం ఉంటే జనం కూడా ఆయన గొంతుతో జత కలిసేవాళ్ళు. అప్పుడు ఆ హీరోకి న్యాయం జరక్కపోయినా కనీసం జనం సానుభూతి దక్కేది.

Nandi Awards 2014-16

ఇక నిజంగానే అవార్డుల ఎంపికలో జరిగే అన్యాయం గురించి మాట్లాడదలుచుకుంటే ఆలా జరగడం ఇదే మొదటిసారి కాదు. చివరిసారి కూడా కాదు. అధికారంలో వున్నవారికి అనుకూలంగా వుండేవాళ్లు పట్ల ఇప్పుడు మాత్రమే తొలిసారిగా పక్షపాతం చూపితే అన్యాయమే. ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఎప్పుడూ చిన్న ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పుడు ఒక్కసారిగా తప్పంతా టీడీపీ సర్కార్ మీద తోసినంత మాత్రాన ఒరిగేది లేదు. కొత్తగా ఏమీ జరగదు. వ్యవస్థలో తప్పులు జరిగినంత కాలం ఊరక ఉండి ఒక్కసారిగా ఆ ప్రభావం మన మీదో, మనకు నచ్చిన వాళ్ళ మీదో పడినప్పుడు మాత్రమే స్పందిస్తే ఆ మాటకు విలువ ఉంటుందా ?