ఎంత అవసరమో అంతే చూపుతున్నాం

Burra Sai Madhav Speech In NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాని దర్శకుడు క్రిష్ ఎంతో అద్బుతంగా రూపొందించాడు ఆ విషయాని మనం ఇటివల ఎన్టీఆర్ బయోపిక్ నుండి విడుదలైన ట్రైలర్ లో చూపించారు. తెలుగు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు కూడా వస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు మార్గదర్శి అయితే మరోక్కరు ఆ మార్గంలోనే వెళ్ళాలని చూపించిన రచయత మరోక్కరు అతనే సాయి మాధవ్ బుర్రా. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ స్టార్ట్ అయ్యినప్పటినుండి ఎన్నో ప్రశ్నలు ప్రజల మనసులో ఉంటాయి. అవి ఎన్టీఆర్ చంద్రబాబు ఎపిసోడ్, మరొక్కటి ఎన్టీఆర్ ఫ్యామిలీ కలహాలు, ఎందుకు ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని మ్యారేజ్ చేసుకున్నాడు ఇవ్వని ఎన్టీఆర్ గురుంచి తెలిసిన ప్రతి ప్రేక్షకుడి మనసులో ఉంటాయి. వీటి గురుంచి ఆ చిత్ర రచయత సాయి మాధవ్ బుర్రాకు పలు సందర్బాల్లో పలు రకాలుగా ఎదురైవుతున్నాయి. ఈ సందర్బంగా సాయి మాధవ్ బుర్రా పాత్రికేయుల మిత్రులతో ఓ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు. ఆ ఇంటర్వ్యూ లో ఎన్నో ప్రశ్నలు సంధానం ఇచ్చాడు.

ఎన్టీఆర్ కు వీరాభిమాని అయినా సాయి మాధవ్ మాట్లాడుతూ… చిరంజీవి, నాగేశ్వరావు గారి గురుంచి ప్రత్యేకంగా తెలుసుకోవ్వడం ఏమి లేదు. ఎన్టీఆర్ గారి సినిమా జీవితంలో అయన డైలాగ్లు అయన నటనను అనుసరించడం వంటివి చేస్తూ ఇక్కడివరకు వచ్చాం అని ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయన సినిమా జీవితాన్ని ఎంతో శోదించి చూపించాం కానీ ఇంకా అయన జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ ని ప్రత్యేకంగా శోదించి మరి చూపించాం అన్నారు. కానీ జనాలు కాంట్రావర్షిని ఇష్టపడుతారు. మీరు ఎన్టీఆర్ గారి జీవితాన్ని పూర్తిగా తెరపైన చూడవచ్చు అన్నారు. చంద్రబాబు ఎపిసోడ్ ఉంటుందాని అడిగిన ప్రశ్నకు. ఎంతో ఎమోషనల్ గా రామారావు గారికి కుటుంబ కలహాలు ఏమైనా వచ్చాయా. చంద్రబాబు కి ఎన్టీఆర్ కి ఏమైనా కుటుంబ విభేదాలు వచ్చాయాని ప్రశ్నించాడు. లక్ష్మి పార్వతి ఎపిసోడ్ ఉంటుందాన్నా ప్రశ్నకు సినిమాలో ఎంతవరకు అవసరమో అంతవరకు చూపించాం లక్ష్మి పార్వతి గురుంచి అడుగుతారని తెలుసు అందులో ఎందుకు లక్ష్మి పార్వతిని మ్యారేజ్ చేసుకున్నాడో, ఎటువంటి పరిస్థితిలో చేసుకున్నాడో అంతవరకు చూపించాం అన్నారు. ఢిల్లీ మిధ తెలుగు వాడు చూపించిన అధిపత్యం. లంచగొండితనాన్నిఎన్టీఆర్ అరికట్టిన తీరును మీరు ఎన్టీఆర్ బయోపిక్ చూడవచ్చు అన్నారు. మహాత్మా గాంధీ గారి జీవితంలో కూడా ఎన్నో ఎర్రర్స్ ఉండవచ్చు అవన్నీ తెరపైన చూపించలేదు మా సినిమా కూడా అంతే ఎంతవరకు ఎన్టీఆర్ గారి జీవిత ప్రయాణం చేశారో అంతవరకు మేము చూపించాం అన్నారు