ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పార్వతీపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా వారణాసికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. బాధితులందరూ కన్నేపుదొర వలాస గ్రామానికి చెందిన వారని తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సు వైజాగ్‌లోని గౌరీశంకర్ ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.