Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కంచే చేను మేసింది అనే సామెత ని నిజం చేసేలా సినీ రంగంలో ఒక ప్రఖ్యాత అసోసియేషన్ కి పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తే తప్పు చేశాడని తెలియడం ఇప్పుడు సంచలనానికి తెర లేపింది. గత కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి అనే నటి తెలుగు చిత్ర సీమ లో క్యాస్టింగ్ కోచ్ అనే సంప్రదాయం ఉందని దానిని రూపుమాపాలని పోరాటం మొదలుపెట్టింది. అయితే ఆ పోరాటం కొంతలో కొంత సఫలమవడంతో అప్పటి దాకా తెర వెనుకే ఉన్న భాదితురాళ్ళు ఇప్పుడు బయటకి రావడం ప్రారంభించారు. ఇప్పటి దాకా శ్రీ రెడ్డి పలు పేర్లని బయట పెట్టగా ఇప్పుడు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా చెప్పబడుతున్న వాళ్ళు మరిన్ని పేర్లు బయట పెడుతున్నారు.
ముందుగా చిరంజీవి ఫ్యామిలీ సినిమాలకి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్న వాకాడ అప్పారావు అనే నిర్మాత బయటకి రాగా ఇప్పుడు మరో సంచలన పేరు బయటకి వచ్చింది. ఆయన ఎవరో కాదు మా అధ్యక్ష్యుడు శివాజీ రాజా, మొన్న మా అసోసియేషన్ ముందు శ్రీ రెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేస్తే కోపంలో నిషేధించామని, ఆమె మా చెల్లి లాంటిది కాబట్టే తప్పుని క్షమించి ఇప్పుడు అవకాసం కలిపిస్తున్నాం. ఇలా ఎవరయినా ఆడవారి మీద లైంగికంగా వేధిస్తే కటిన చర్యలు ఉంటాయని ప్రకటించిన ఆయనే స్వయంగా కొంత మంది మహిళా ఆర్టిస్ట్స్ ని వేధించారని ఓ నటి ఆరోపించింది.
ఈరోజు టీవీ9 లో లైవ్ ప్రోగ్రాం లో పాల్గొన్న రాగ శృతి అనే ఓ మహిళా ఆర్టిస్ట్, ఏమైనా వేధింపులు జరిగితే చెప్పుకోమంటున్నారు కదా మా పెద్దలు అని, వారు కూడా సరయిన వారు కాదని వారు కూడా ఆ హీరో ని పరిచయం చేస్తా, దర్శకుడిని పరిచయం చేస్తా అని అమ్మాయిలని వాడుకునేవారే ఉన్నారు అలాంటప్పుడు మేము న్యాయం కోసం ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆమె ప్రశ్నించింది. శివాజీ రాజా పేరుని ప్రస్తావించిన ఆమె స్వయంగా శివాజీ రాజా తననే అలా లోబరుచుకేందుకు చూసాడని శ్రీకాంత్ కి పరిచయం చేస్తా, కృష్ణ వంశీ కి పరిచయం చేస్తా అంటూ తనని మభ్య పెట్టాడని అలాగే తనలాగే ఎంతో మంది అమ్మాయిలని అదే విధంగా వాడుకోవడానికి చూసాడని ఆమె ఆరోపించింది. , వారు సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్దమని బయటకి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెప్తామని ఆమె అన్నారు.
శ్రీ రెడ్డి ని బ్యాన్ చేస్తున్నామని వాళ్ళే అనీ తర్వాత మా చెల్లి లాంటిది నిషేధం లేదు అనీ వాళ్ళే అనీ క్లారిటీ లేకుండా ఒక మా అనే పెద్ద అసోసియేషన్ ని వాళ్ళు ఎలా నడుపుతారు అని ఆమె ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు మంచి వాళ్ళు అని ప్రజలు భావిస్తున్న వారంతా ఒకే కోవ కి చెందిన వారని తెలియడంతో ఏది నిజం ఏది అబద్దం ? ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. మున్ముందు ఇంకెంతమంది పేర్లు బయటకి వస్తాయో ?