కేంద్రం సెల్ఫ్ గోల్…సీబీఐ ప్రకటన…!

Cbi-Says-Alok-Verma-Still-I

కేంద్రం ఆడుతున్న ఆటలో మరో గోల్ పడింది. నిన్నటికి నిన్న ఇద్దరు టాప్ మోస్ట్ అధికారుల మధ్య వచ్చిన విభేదాల వలన వారిని సెలవు మీద పంపిన వారు మళ్ళీ వెనక్కు పిలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు సీబీఐ డైరెక్టర్‌గా మళ్లీ అలోక్ వర్మనే కొనసాగనున్నారు. ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్థానా సైతం తన బాధ్యతలు తిరిగి చేపట్టనున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది. సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలు తిరిగి తమ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. ఇటీవల సీబీఐ బాస్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎం నాగేశ్వరరావు కేవలం తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

Four Men Held For Lurking Outside Cbi Chief Alok Vermas Delhi Residence
కేంద్ర నిఘా విభాగం (సీవీసీ) అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలపై వచ్చిన ఆరోపణలను, వారు ఇచ్చిన వివరణను పరిశీలిస్తుందని చెప్పారు. అయితే విచారణ ముగిసేంతవరకు వారికి ఎలాంటి అధికారలు ఉండవని సీబీఐ స్పష్టం చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా అధికారాల నుంచి తొలగించి, తనను సెలవులపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది. సీబీఐ అధికారులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అలోక్ వర్మ ఆఫీసు నుంచి ఫైళ్లు మాయం చేశారన్నది వాస్తవం కాదని చెప్పారు. అధికారులు కార్యాలయాల్లో డాక్యుమెంట్లు భద్రపరచాలి, కానీ వ్యక్తిగతంగా వెంట పెట్టుకు తిరగరని అభిషేక్ దయాల్ వివరించారు.

Govt-Order-Sending-Him-On-L
అయితే న్యాయవాది ప్రశాంత్ భూషన్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరిలు రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు వ్యవహారానికి సంబంధించి ఈ అక్టోబర్ 4న అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ఫిర్యాదు చేశారు. 36వేల కోట్లతో ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐ బాస్‌ల మీద ప్రతీకార చర్యలకు దిగుతోందని బయట జనాల్లోకి వెళ్ళినందువలెనే ఈ స్టేట్మెంట్ ఇప్పించి ఉండవచ్చని భావిస్తున్నారు.