Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ప్రభుత్వం సుదీర్ఘ విరామం తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఒకేసారి మూడు సంవత్సరాలకు గాను నంది అవార్డులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం విజేతల ఎంపిక విషయంలో మాత్రం రాజకీయం చూపించిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నంది అవార్డు విజేతల జాబితాను చూస్తుంటే రాజకీయాలు నడిచాయంటూ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి అవార్డులు కట్టబెట్టింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి చెందిన వారికి ఏకంగా మూడు అవార్డులు రావడం పట్ల అంతా కూడా ఒకింత ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం పలు విభాగాల్లో అవార్డులను కట్టబెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడుకు బావమర్ది అవ్వడంతో పాటు తెలుగు దేశం ఎమ్మెల్యే అవ్వడం వల్లే బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు పలు అవార్డులు దక్కాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్‌కు అవార్డు ఇవ్వడం పట్ల ఆయన్ను టీడీపీకి వాడుకోవాలనే ఉద్దేశ్యం ఉందని కొందరు ఊహాగాణాలు వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణను మచ్చిక చేసుకునేందుకు కళ్యాణ్ రామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్‌కు అవార్డును ఇచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు.
మొత్తానికి రాజకీయ అవసరా కోసం నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం వాడుకుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో దాసరి నారాయణ రావుకు ఉత్తమ నటుడు అవార్డు రావడం ఎంతటి దుమారంను రేపిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ అవార్డులు కూడా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి అవార్డులను ప్రకటించే కన్నా, ప్రకటించకుండా ఉండటం ఉత్తమం అంటూ కొందరు సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నంది అవార్డులపై వస్తున్న విమర్శలకు ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.