Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్న ఆంధ్ర మేధావుల ఫోరమ్ నేత చలసాని శ్రీనివాస్ బీజేపీ మీద తన కోపాన్ని ఆ ఒక్క అంశానికే పరిమితం చేయలేదు. ఇటీవల కాంగ్రెస్ గురించి విమర్శ చేస్తూ ఆ పార్టీని రద్దు చేయాలన్న గాంధీ సలహాను గుర్తు చేస్తూ జాతిపితని తెలివైన వ్యాపారవేత్తగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆ అంశం మీద చలసాని శ్రీనివాస్ అమిత్ షా కి రాసిన లేఖ మీ కోసం.
మా నాన్నగారికి 85 సం.క్రితం మా తాతగారు ‘గాంధీ వర ప్రసాద’ రావు అని పేరు పెట్టినప్పుడు ఒక కోమిటాయన పేరు పెడుతున్నామని అనుకోలా.. సోయి వచ్చినప్పటినుంచీ మేము కూడా గాంధీ తాత అహింసావాదానికి ప్రపంచములో చిరునామా, మనకు జాతిపిత అనుకున్నాము. మా అమ్మగారికి 8 దశాబ్దాల క్రితమే జిజియా అని పేరు పెట్టినప్పుడు ఛత్రపతి శివాజీకి మంచి గుణం, ధర్మశాస్త్రాలు, దేశభక్తి నూరిపోసిన గొప్ప అమ్మ పేరు అనుకున్నారు గానీ, మరాఠా కులపావిడ పేరు పెడుతున్నామని ఆ తాతగారు అనుకోలేదు.
జైన మతస్తుడివైన అమితం షా గారూ.. ఏమిటీ గాంధీ గారు “” మరీ”చాలా తెలివైన (bahut charitra bania= cunning n clever, Trader?) కోమిటాయనా?”””” మీది, మోదీ గారి పద్దతి చాలా భయంకరంగా ఉంది. ఈ కులాల గొడవ పెట్టి గాంధీ గారిని జాతీయ నాయకుడినుంచి ఒక కులానికి పరిమితం చేసే లోతైన కుట్ర కాదా? మళ్ళా అలా అనడం సరైనదే అని దేశభక్తికి లింక్ పెట్టి ఎవరైనా అడ్డంగా సిగ్గు లేకుండా సమర్ధించడం చూస్తే అసలు మరోసారి వీళ్ళ మొహం చూడాలనిపిస్తుండా భారతీయులకి?.
ఫాసిస్ట్, నాజీయిజం ఈ దేశంలో తీసుకురావడానికి భయంకర కుట్ర కొందరు చేస్తున్నారు. మతంని వాడుకుని దానికి పేటెంట్ తీసుకుని, కులం, తిండి ఇలా భావోద్వేగాలు బాగా రెచ్చగొడదామని యత్నిస్తున్నారు. చాల తెలివిగా దానికి అనుగుణంగా వేలాదిమంది సోషల్ మీడియాలో పెయిడ్ వారు మనకు తెలియకుండానే పనిచేస్తున్నారా? ఎవరైనా ఆ విధానం తప్పంటే వారిపై దేశద్రోహుల ముద్ర వేస్తున్నారు. ఒక పార్టీకి, ఒక సమితికి బానిసలుగా ఉండకపొతే వారికి దేశభక్తి తక్కువ అని సర్టిఫికెట్లు ఇవ్వడానికి వారెవరు? దయచేసి అప్రమత్తతతో ఉండండి.. – చలసాని
మరిన్నివార్తలు
రిపోర్టింగ్ లో పోలీస్… తోకముడిచిన జర్నలిస్ట్
పవన్ కి భక్తి పెరిగిందా ?