Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాలిటిక్స్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న ఏపీ సీఎం చంద్రబాబు ఉపఎన్నికల గెలుపుతో సంతృప్తి చెందడం లేదట. క్షేత్రస్థాయిలో నాయకులు సరిగ్గా పనిచేసి ఉంటే.. నంద్యాల మెజార్టీ మరో పదివేలు పెరిగేదని, అలాగే కాకినాడ కార్పొరేషన్లో మరో మూడు డివిజన్లు వచ్చేవని నేతలకు చురకంటించారట. దీంతో అవాక్కవడం నేతల వంతైంది. ఇప్పటికే 60 శాతం మంది ప్రజలు టీడీపీవైపు ఉన్నారంటున్న చంద్రబాబు.. పోల్ మేనేజ్ మెంట్ లో నేతలు విఫలమయ్యారని చెప్పారట. కరెక్టుగా పనిచేసి ఉంటే.. వైసీపీకి ఇంకా తక్కువ ఓట్లు వచ్చేవని బాబు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోల్ మేనేజ్ మెంట్ విషయంలో గట్టిగా ఉండాలని, అప్పుడే అనుకున్న విధంగా సీట్లు గెలవగలమనేది సీఎం మాట.
ముఖ్యమంత్రి ఆలోచనలు తెలుసుకున్న నేతలు ఆశ్చర్యపోతున్నారట. బూతులవారీగా ఓట్లను సమీక్షించడంలో ఆరితేరిన చంద్రబాబు.. తనదైన పోల్ మేనేజ్ మెంట్ తో అమరావతిలో కూర్చునే ఎన్నికల్లో శ్రేణుల్ని నడిపించారు. అలాంటి సీఎం ఇలా మాట్లాడటంలో తప్పులేదని నేతలంటున్నారట. కొన్ని లోపాలున్నాయని తమకూ తెలుసని, అధినేత హితవుతో తప్పులు దిద్దుకుంటామని చెబుతున్నారట. దటీజ్ చంద్రబాబు.
మరిన్ని వార్తలు:
-
మరో సర్జికల్ స్ట్రైక్స్ కు రెడీ
-
అసలు డిజైన్లు అవి కావా..?