Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ మీద యుద్ధం ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నాడని కొందరు అంటున్న మాట. ఆ మాట నేడోరేపో నిజం అయినా అవ్వొచ్చు. అయినా చంద్రబాబు వేసిన ఎత్తు ఎలాంటిదో ఆ దెబ్బ తిన్న పార్టీలకు కూడా ఇంకా అర్ధం కావడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఒక్క దెబ్బతో చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులందరినీ ఏకాకుల్ని చేసి పారేసాడు. బీజేపీ , వైసీపీ , జనసేన ల్ని దగ్గరికి తీయడానికి కారణం వారితో ఉమ్మడిగా నిలబడి చంద్రబాబు ప్రాభవానికి గండి కొట్టాలని. కానీ అనూహ్యంగా బీజేపీ కి ఎదురు నిలిచి రాత్రికి రాత్రే అవిశ్వాస తీర్మానం దాకా వెళ్లిన చంద్రబాబు ఒక దెబ్బతో బీజేపీ , జనసేన , వైసీపీ లను ఏకాకిగా నిలిపాడు.
విభజన హామీలు తుంగలో తొక్కిన బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపోతున్నారు. టీడీపీ కూడా ఎదురు తిరగడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎవరికైనా నష్టమే తప్ప లాభం లేదని అందరికీ అర్ధం అయ్యింది. దీంతో ఏపీ లోనే కాదు దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతీయ పార్టీలు బీజేపీ తో పొత్తుకు నో అంటున్నాయి. ఇక ఏ ఆంధ్రప్రదేశ్ లో వెలిగిపోవాలని బీజేపీ ఈ పని చేసిందో అక్కడే తమ వంత పాడుతున్న వైసీపీ , జనసేన కూడా తమతో కలిసి ఎన్నికలకు వెళితే నష్టం అని కమలనాధులు అర్ధం చేసుకున్నారు. అందుకే ఇక్కడ ఏపీ లో బీజేపీ , వైసీపీ , జనసేన ఒంటరి పోటీ చేయాల్సిన పరిస్థితి వుంది. పైగా బీజేపీ తో సాన్నిహిత్యం వల్ల లెఫ్ట్ పార్టీలు సైతం ఎన్నికల్లో వీరితో కలిసి నడవడం కష్టమే. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత నాలుగు పక్షాల మధ్య చీలిపోతుంది. అందరి లక్ష్యం చంద్రబాబుని ఓడించడం అయినా కలిసి పోయే పరిస్థితి లేకుండా బాబు వేసిన ఈఎత్తుతో ఆ పార్టీలన్నీ ఏకాకి అయ్యాయి.