Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ చాణుక్యుడు అని చంద్రబాబుని ఎందుకు అంటారో ఇప్పుడు చాలా మందికి తెలిసొచ్చింది. ముఖ్యంగా ఆయన సహనాన్ని చేతగానితనంగా భావించిన ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు బాబు. ఓ పక్క బీజేపీ తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఇంకో వైపు అవిశ్వాస నాటకం ఆడుతున్న వైసీపీ కి ఊహించని షాక్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబుని లొంగదీసి తాము ఇచ్చే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేలా చేశామని వైసీపీ పొంగిపోతున్న తరుణంలో బాబు విసిరిన పాచికతో వైసీపీ తో పాటు బీజేపీ కూడా ఉలిక్కిపడింది.
Nda నుంచి బయటకు రావడానికి పార్టీ ముఖ్యులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వున్నపళంగా ఇంకో నిర్ణయం ప్రకటించారు. Nda నుంచి బయటకు రావడమే గాకుండా టీడీపీ స్వయంగా అవిశ్వాస తీర్మానం చేయాలని పార్టీ పార్లమెంటరీ నాయకుడు తోట నర్సింహం కి సందేశం పంపారు. బాబు నిర్ణయంతో కనీసం అవిశ్వాస తీర్మానం క్రెడిట్ కొడదామని చూసిన వైసీపీ కి మైండ్ బ్లాక్ అయ్యింది. బాబు నిర్ణయానికి మద్దతుగా కాంగ్రెస్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలతో పాటు సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, ఆర్జేడీ లాంటి పార్టీలు వాణి వినిపించడంతో బీజేపీ అవాక్కు అయ్యింది. ఈ అవిశ్వాసం వీగిపోయినా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శ్రేణుల్లో ఉత్సాహం తెప్పించిన ఘనత బాబు దక్కించుకున్నారు. ఇక బాబు కి వ్యతిరేకంగా మాట్లాడి కీలక సమయంలో బీజేపీ తొత్తుగా ముద్ర వేయించుకున్న పవన్ రాజకీయ భవిష్యత్ ఒక్కసారిగా అయోమయంలో పడింది. బాబుని ఇబ్బంది పెట్టేందుకు ఒక్కటైన ముగ్గురు ఆయన విసిరిన ఒకే ఒక్క పాచికతో డిఫెన్స్ లో పడ్డాయి.