Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు ఇకపై జంటగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటిదాకా కత్తులు దూసుకుంటూ పైపైకి మాత్రమే నవ్వులు రువ్వుకుంటున్న ఈ ఇద్దరూ ఇకపై ఒకే మాట,ఒకే బాటగా వ్యవహరించబోతున్నారు. ఈ ఆశ్చర్యకర పరిణామం వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్ తప్పదు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ల భయమే చంద్రులిద్దరూ ఒక్కటి కావడానికి కారణం అని విశ్వసనీయ సమాచారం.
వెంకయ్య నాయుడు ఎప్పుడైతే ఉప రాష్ట్రపతి అభ్యర్థి అని తేలిందో అప్పటినుంచి ఇక ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎవరితో సంప్రదించాలన్న ఆలోచన చంద్రులిద్దరినీ ఆలోచనలో పడేట్టు చేసిందట. పైగా రాష్ట్రపతి ప్రమాణం స్వీకారం కోసం వెళ్ళినప్పుడు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల నుంచి ఎదురైన అనుభవాలు, మాటలు చూసి ఇక ఐక్యంగా లేకపోతే కేంద్రం చేతికి జుట్టు ఇచ్చినట్టే అన్న అభిప్రాయం యిద్దరు సీఎం లకు వచ్చిందట. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పెంపు అంశాన్ని హోమ్ మంత్రి రాజ్ నాధ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సూటిగా ప్రధాని మోడీ రాజకీయ నిర్ణయం తీసుకుంటే గానీ ముందుకు వెళ్లలేమని చెప్పడం చంద్రులు ఇద్దరినీ బాగా హర్ట్ చేసిందట.
తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాల్ని అలుసుగా తీసుకుని బీజేపీ ఇక్కడ పాగా వేయాలనుకుంటున్న విషయం చంద్రులకి బాగా అర్ధమైంది. భవిష్యత్ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచైనా ఒకే మాటతో లేకుంటే కేంద్రం ఇద్దరినీ ఒక ఆట ఆడుకోవడం ఖాయమని తెలిసిపొయిందట. అందుకే విభజన సమస్యలు, ఓటుకి నోటు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్… ఇలా ఏ విషయం మీద అయినా ఇకపై ఏకతాటిపైకి రావాలని చంద్రులిద్దరూ భావిస్తున్నారట. ఇందుకోసం ఓ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు చంద్రులిద్దరూ త్వరలో ఓ సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారట. అది ఎక్కడ జరుగుతుందన్నది త్వరలో తెలుస్తుందట.
మరిన్ని వార్తలు
వైసీపీ లో ఈ 30 మందికి టిక్కెట్లు ఖరారు?
రాము, సోము కలిసి రాత మార్చేస్తారా..?
ఆ జ్యూస్ తాగితే డ్రగ్స్ కేసు నుంచి రిలీఫ్ ?