Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులని ముఖ్యమంత్రి చంద్రబాబు భర్తీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా పలు కార్పోరేషన్లకు చైర్మన్ లని చంద్రబాబు ఎంపిక చేశారు. టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమిస్తారని గతేడాదిగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి. సుధాకర్ యాదవ్ క్రైస్తవ మత సంస్థలతో సంభందాలు కలిగి ఉన్నాడని, హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్న వారినే టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని ఆర్ఎస్ఎస్తో పాటు పలువురు మఠాధిపతుల నుంచి గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
కానీ పుట్టా వివరణ తీసుకున్న చంద్రబాబు మఠాధిపతుల కి, ఆర్ఎస్ఎస్ కి ఒక ఎదురువెళ్లి మరీ ఆయన్ని నియమించినట్టు సమాచారం. తానూ క్రైస్తవ సభలకి వెళ్ళిన మాట వాస్తవమే అని కానీ తానొక రాజకీయ నాయకుని హోదా లో మాత్రమె ఆ సభలకి హాజరయ్యానని సుధాకర్ యాదవ్ వివరణ ఇచ్చినటు తెలుస్తోంది. ఈ వివరణ పొందిన బాబు పుట్టాకే పట్టం కట్టాలని భావించి ఆయన పేరే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుధాకర్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖా మంత్రి యనమలకి స్వయానా వియ్యంకుడు.
టీటీడీకే కాక రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు కూడా ఏపీ ప్రభుత్వం ఛైర్మన్లను నామినేట్ చేసింది. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా… మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి కూడా కీలక పదవి లభించింది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కిషోర్ కుమార్ రెడ్డిని నామినేట్ చేశారు. అదే విధంగా ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్లా రామయ్యని ఎంపిక చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా అంకమ్మ చౌదరిని, ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా దాసరి రాజా మాస్టర్ ప్రభుత్వం నియమించింది.
హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నమన రాంబాబు, కాపు సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుణ్ని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర రావును, స్టేట్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా ఎస్ఎం జియావుద్దీన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎండి హిదాయత్, గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌గా వై.నాగేశ్వరరావు యాదవ్, మినిమం వేజెస్ బోర్డు చైర్మన్‌గా రఘుపతుల రామ్మోహనరావుని బాబు సర్కారు నామినేట్ చేసింది.