Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ వ్యవహారంలో సర్కార్ మీద వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడానికి సీఎం చంద్రబాబు ఉపక్రమించారు. ఈ విషయంలో ఇన్నాళ్లు మౌనం వహించిన ఆయన ఇక ఇలాగే కొనసాగితే నష్టమని గ్రహించారు. అందుకే విజయవాడలో కాపులు, కాపు నేతలతో ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్స్ కల్పిస్తామని, ఆ క్రమంలో బీసీ లకి అన్యాయం జరక్కుండా చూస్తామని చెప్పారు. ఈ అంశంలో ముద్రగడని వెనుకుండి నడిపిస్తున్న వైసీపీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు పావులు కదిపారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ద్వారా రిజర్వేషన్స్ మీద కాపులకి స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు జగన్ ముసుగు తీసి చూపారు. ఇంతకీ విజయవాడలో బాబు ఏమన్నారో చూద్దామా ?.
కాపు రిజర్వేషన్ల మహసభ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బులెట్ పాయింట్స్
1. కాపుల సంక్షేమాన్ని ఎన్నికల ప్రణాళికకే పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు.
2. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు.
3. కాపులను బిసిల్లో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే.
4. కాపుల సమాచారాన్ని సేకరించేందుకు రూ.40 లక్షలు కూడా కేటాయించని రాజశేఖరరెడ్డి.
5. నన్ను బహిరంగంగా ఉరి తీయాలని అంటున్న వ్యక్తి కూడా ఆ పార్టీ ప్లీనరీలో కాపుల గురించి మాట్లాడకపోవడం
శోచనీయం. కనీసం ఆపార్టీ ఎన్నికల ప్రణాళికలోనైనా కాపుల రిజర్వేషన్ల గురించి ఎందుకు చేర్చలేదు.
6. పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ.
7. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి మంజునాథకమిషన్ నివేదిక.
8. నివేదిక అందగానే మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం.
9.కాపులను బిసిల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం.
10. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధికలోటు ఉన్నగాని అధిగమించి రాష్ట్రాభివృద్ధికి కృషి.
11. కాపుల మనోభావాలను అర్ధం చేసుకున్నాను.
12. కాపుల సామాజిక వెనుకబాటుతనం లేకుండా చేస్తా.
13. బిసీల్లో ఉన్న భయాన్ని తొలగిస్తూ కేవలం విద్య, ఉద్యోగాలల్లో రిజర్వేషన్లు కోరడం హర్షణీయం.
14. రాజకీయ రిజర్వేషన్ల విషయంలోకూడా అన్యాయం జరగనివ్వను.
15. బిసీలకు ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే కాపులకు రిజర్వేషన్లు
16, కాపు భవనాలను ఆధునిక సాంకేతికతో నిర్మిస్తాం.
17. అన్ని విధాల ఆర్ధికంగా, విద్యాపరంగా రాజకీయంగా అభివృద్ధి చేస్తాం.
మరిన్ని వార్తలు: