Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముద్రగడ ఉద్యమ నేపథ్యంలో కాపుల మనోభావాలు ఎలా వుంటాయో అని భయపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రిలాక్స్ అయ్యారు. ముద్రగడ ఎంత గోల చేసినా కాపు రిజర్వేషన్స్ విషయంలో తన వైఖరిని నమ్మిన కాపు జాతికి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోడానికి చంద్రబాబు చర్యలు వేగవంతం చేస్తున్నారట. అయితే రిజర్వేషన్ వ్యవహారం పూర్తిగా కొలిక్కి వచ్చే లోగా కాపుల్లో విశ్వాసం కోల్పోకుండా చూసేందుకు కాపు కార్పొరేషన్ వ్యవహారాల్ని ఇంకా సమర్ధంగా నిర్వహిచాలని బాబు భావిస్తున్నారట. కాపు కార్పొరేషన్ చేస్తున్న పనులకి రావాల్సినంత ప్రచారం రావడం లేదన్న అభిప్రాయంతో వున్న చంద్రబాబు ఈసారి కార్పొరేషన్ చైర్మన్ పదవికి కాపుల్లో ప్రజాకర్షణ వున్న లేదా సబ్జెక్టు మీద అపారమైన పట్టు వున్న నాయకుడిని ఎంపిక చేయాలి అనుకుంటున్నారట.
ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ గా వున్న చలమలశెట్టి రామాంజనేయులు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో ముద్రగడని దీటుగా ఎదుర్కోలేకపోయారన్న భావన టీడీపీ వర్గాల్లో వుంది. చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో వున్నారు. అందుకే ఈసారి ముద్రగడ విమర్శల్ని గణాంకాలతో సహా తిప్పికొట్టగల నాయకుడు లేదా ప్రజాకర్షణ శక్తి తో ఆ వ్యాఖ్యల్ని తప్పుపట్టగలిగే స్థాయి నాయకుల కోసం బాబు వేడుకుతున్నారట. ఆ వేటలో ఇప్పటికి రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎంపికైన చందు సాంబశివరావు కి ప్రభుత్వ పధకాల అమలు మీద మంచి పట్టు ఉన్నట్టు గుర్తించారు. ఇక తూర్పు గోదావరికి చెందిన తోట త్రిమూర్తులు కి కాపుల్లో మంచి గుర్తింపు ఉన్నట్టు చంద్రబాబు కి నివేదిక అందిందట. ఆ ఇద్దరిలో ఒకరికి ఈసారి కాపు కార్పొరేషన్ అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉందట
మరిన్ని వార్తలు: