Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీలో మంది ఎక్కువయ్యారు. దీంతో అందరికీ పదవులు సర్దుబాటు కావడం లేదు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి పదవుల కోసం వచ్చినవారు అస్సలు వెయిట్ చేయలకేపోతున్నారు. సైకిల్ పార్టీ పాతకాపులు కామ్ గా ఉంటున్నా… వీరు మాత్రం పదవులు దక్కలేదని రంకెలేస్తున్నారు. ముఖ్యంగా శిల్పా బ్రదర్స్ పార్టీ మారటాన్ని చంద్రబాబు చివరి నిమిషం వరకూ ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు బుద్ధిగా విన్నా… తర్వాత తాము అనుకున్నది చేసేశారు.
ఇప్పుడు నంద్యాల సీన్ నెల్లూరులో రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ముందుజాగ్రత్తగా ఆనం బ్రదర్స్ ను లైన్లో పెట్టారు బాబు. కొన్నాళ్లుగా వివిధ కారణాల పదవులు ఇవ్వలేకపోయామని సర్దిచెబుతూనే.. రామనారాయణరెడ్డికి మాత్రం పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారు. తన కలల ప్రాజెక్టు అయిన చంద్రన్న బీమా, హౌసింగ్ ప్రాజెక్టులు అప్పజెప్పాలని డిసైడయ్యారు.
కానీ గతంలో ఆర్థిక మంత్రిగా నియమిస్తారని ఊహాగానాలు వచ్చిన తరుణంలో. ఈ పదవితో ఆనం బ్రదర్స్ సంతృప్తి పడతారా… లేదా అనేది నెల్లూరు పాలిటిక్స్ లో ఆసక్తకిరంగా మారింది. నంద్యాలలో శిల్పా పార్టీ మారినా టీడీపీ గెలుస్తోందని, నెల్లూరులో కూడా అదే జరుగుతుందని, ఈ సంగతి ఆనం బ్రదర్స్ కు తెలుసని తెలుగు తమ్ముళ్లంటున్నారు.
మరిన్ని వార్తలు: