Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలి – ఎపి సిఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్ర విభజన, సమయంలో ఎంతో బాధపడ్డా
ఎపికి ప్రత్యేక హోదా సాధించే ధైర్యం ఇవ్వమని స్వామివారిని ప్రార్థించా
కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉంది
జపాన్ తరహాలో ఆందోళన, అభివృద్ధి రెండూ కొనసాగుతోంది
మా ఇంటి కులదైవం – నేను ఆరాధించే దేవుడు వేంకటేశ్వరస్వామి
నా మనవడు దేవాన్ష్ కు మూడేళ్ళు పూర్తి కావడంతో శ్రీవారిని దర్సించుకున్నాం
తిరుమలలో రాజకీయాలను మాట్లాడనంటూనే ఐదు నిమిషాల పాటు ఎపిలో నెలకొన్న పరిస్థితులు, టిడిపి కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని మీడియాకు వివరించిన సిఎం
టీటీడీ అన్న దాన పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడి తరుపున రూ.26 లక్షలు విరాళం.
వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్న ప్రసాదం వడ్డన,స్వీకరణ.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనుమడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు బుధవారం ఉదయం
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదం హాల్ చేరుకుని ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు అన్న ప్రసాధములు కుటుంబసభ్యులతో స్వీకరించారు.
ఈ సందర్భంగా అన్న ప్రసాదం సేవకులు ముఖ్యమంత్రి కి వారి కుటుంబ సభ్యులకు టిటిడి సేవా స్కార్ఫ్ ను గౌరవంగా వారి భుజాల చుట్టూ వేశారు
సీఎం, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శ్రీవారి అన్న ప్రసాదం హాల్లో భక్తులకు అన్న ప్రసాదములను వడ్డించారు.
ఈసందర్భంగా తన, మనుమడు పుట్టినరోజు సందర్భంగా నారా దేవాన్ష్ తరఫున 26 లక్షల రూపాయల విరాళాన్ని డిడి రూపంలో శ్రీవారి అన్న ప్రసాదం సేవకోసం టిటిడి ఈఓ, తిరుమల జేఈఓ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందచేశారు. ఈ కార్యక్రమంలో మనుమడు దేవాన్ష్, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ప్రజా ప్రతినిధులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.