Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాషాయ జెండా రెపరెపలు , ప్రధాని మోడీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ అలుపెరగని పోరాటం చేస్తున్నా ఇప్పటిదాకా అంతంత మాత్రం ఫలితమే వచ్చింది. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా మోడీ స్పీడ్ కి బ్రేకులేసే ఇంకో ఫ్రంట్ కి రూపకల్పన చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఏర్పడబోతున్న కొత్త ఫ్రంట్ లో కేవలం ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషించబోతున్నాయట. మరీ ముఖ్యంగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కి సమదూరం పాటించాల్సిన రాజకీయ అవసరం వున్న పార్టీలు ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వరసలో ఇద్దరు చంద్రులు బాగా ముందు ఉన్నట్టు కేంద్రం దగ్గర పక్కా సమాచారం ఉందట.
రాష్ట్ర విభజన తర్వాత ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ ల ప్రాధాన్యం తగ్గిపోయింది. తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి తో పాటు, కెసిఆర్ వ్యతిరేక వర్గాలు ఒక్కతాటి మీదకు రావడంతో తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఈ మధ్య కొంత మెరుగైంది. కానీ బీజేపీ పరిస్థితి రెండు చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు తయారైంది. తెలంగాణాలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక ఆంధ్రాలో ఆ పార్టీ పేరు చెబితే జనం కోపంతో రగిలిపోతున్నారు. ప్రత్యేక హోదా,పోలవరం సహా వివిధ అంశాల్లో వాగ్ధాన భంగం చేసిన బీజేపీ మీద ఆంధ్రాలో ఓ రకమైన ఏహ్య భావం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉత్తరాదిన వచ్చే ఎన్నికల్లో జరిగే నష్టాన్ని దక్షిణాదిన పూడ్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఇక్కడ వున్న ఐదు రాష్ట్రాల్లో రాజకీయ అయోమయ పరిస్థితులు సృష్టించి తద్వారా లబ్ది పొందాలని బీజేపీ ప్లాన్. ఈ వ్యూహాన్ని ముందుగా పసిగట్టారు రాజకీయ చాణుక్యులు అయిన ఇద్దరు చంద్రులు. అందుకే బీజేపీ ని నిలవరించడమే ప్రధాన ఉద్దేశంగా దేశంలో ఆ పార్టీని వ్యతిరేకించే ప్రాంతీయ పక్షాలను ఒకే ఫ్రంట్ కిందకు తెచ్చేందుకు రహస్య ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరు చంద్రుల ప్లాన్ కి వివిధ పార్టీల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫ్రంట్ లో చేరడానికి టీడీపీ, తెరాస తో పాటు శివసేన, డీఎంకే, సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది, బీజేడీ, ఆప్, ఆర్జేడీ, జేడీఎస్ లాంటి దాదాపు 15 పార్టీలు ఆసక్తి సీబీఉపుతున్నట్టు సమాచారం. ఇందులో కొసమెరుపు ఏమిటంటే తెలుగు రాజకీయాల్లో సరికొత్తగా ఎన్నికల బరిలో దిగబోతున్న జనసేన సైతం ఈ ఫ్రంట్ మీద అమిత ఆసక్తి కనబరుస్తోంది. అయితే ఈ ప్రాంతీయ పార్టీలను కలిపే దారం ముక్కలాంటి జాతీయ పార్టీ అవసరం ఒకటి కనిపిస్తోంది. ఆ అవసరం తీర్చడానికి లెఫ్ట్ ముందుకు రావాలంటే ఈ కూటమిలోని చాలా పక్షాలకు ఎర్ర జెండా సిద్ధాంతాలు బూజు పట్టాయన్న అభిప్రాయం వుంది. ఆ విషయంలో లెఫ్ట్ వైఖరి కొంత మారితే ఈ కూటమిలో ఎర్రజెండా కూడా ఉంటుంది.