Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత చరిత్ర చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఆయనలో కలిగిన మార్పులు ఏంటి, ఆయన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే విషయాలను వర్మ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌కు వెన్ను పోటి పొడిచి చంద్రబాబు అధికారాన్ని లాక్కున్నాడు అనే విమర్శలు ఉన్న విషయం తెల్సిందే. ఆ విషయంపై కూడా క్లారిటీగా వర్మ చూపిస్తాడని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చంద్రబాబును విలన్‌గా వర్మ చూపిస్తాడేమో అంటూ తెలుగు దేశం నాయకులు భయపడుతున్నారు.
అందుకే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై తెలుగు దేశం పార్టీ నాయకు ఒకరి తర్వాత ఒకరు చొప్పున విరుచుకు పడుతున్నారు. పలువురు టీడీపీ నేతలు వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విమర్శలను తన సినిమా ప్రమోషన్ కోసం వర్మ వినియోగించుకుంటున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలను ఆపేశారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు చరిత్రను వక్రీకరిస్తే ఎవరు ఊరుకోరు అంటూ వర్మకు సున్నితంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడులో కూడా కాస్త టెన్షన్ కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలు పార్టీకి నష్టం అని ఆయన భావిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల పాత్రలు ఎవరు పోషిస్తారు అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రాబోతుంది. అయితే చంద్రబాబు నాయుడు పాత్రను మాత్రం జేడీ చక్రవర్తి పోసించబోతున్నట్లుగా వర్మ కంపెనీ నుండి సమాచారం అందుతుంది. మొదటి నుండి కూడా జేడీ ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌లో పాలు పంచుకుంటున్నాడు. లక్ష్మీ పార్వతి వద్దకు వెళ్లి మరీ ఆమె అనుమతిని జేడీ తీసుకున్నాడు. వర్మకు అత్యంత ఆప్తుడు అయిన జేడీకి ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను వర్మ కట్టబెట్టాడు. మరి వర్మ ఇచ్చిన బాబు పాత్రను జేడీ ఎలా పోషిస్తాడో చూడాలి. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని వర్మ చెబుతున్నాడు.