బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ వచ్చిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంను రెండు భాగాలుగా తెరకెక్కించారు. అందులో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు బుధవారం విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో సినిమా పరిశ్రమకు చెందినా చాలా మంది స్టార్స్ నటించారు. ఈ చిత్రాని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్లో బాలకృష్ణ, క్రిష్, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, విప్ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితరులు వీక్షించారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…. క్రిష్ ఈ చిత్రాని చాలా అద్బుతంగా రూపొందించాడు. అతనికి నా అభినందనలు, ఈ చిత్రంలో నటించిన నటి, నటులకు కంగ్రాట్స్ అంటూ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన చాలా సంఘటనలను చూపించారు.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణకు నా అభినందనలు. ఇప్పటి తరం వాళ్ళకు ఎన్టీఆర్ గురుంచి తెలియలిసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. అలాగే ఈ చిత్రంలో మీ పాత్రపై మీ స్పందన అడగ్గా అందుకు నా గురుంచి నాకంటే మీకే భాగా తెలుసు అన్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఎన్టీఆర్ కథానాయకుడు లాగే, ఎన్టీఆర్ మహానాయకుడు కూడా అందరికి నచ్చేలగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రతి ఒక్కరు చూడవలిసిన చిత్రం అన్నారు. మాకైతే పాతరోజులు గుర్తుకు వచ్చాయి మేము కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వాళ్ళలో ఒక్కరంని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చాడు. రెండోవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7 న విడుదలవుతుంది.