Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ వెనక బీజేపీ ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. తమిళనాడు తరహా రాజకీయాలను ఏపీలో కూడా నడిపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని, అలాంటి నాటకాలు ఇక్కడ నడవబోమని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్నటిదాకా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో డ్రామా ఆడించారని, ఇప్పుడు పవన్ ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఎర్రచందనంపై పవన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ పై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, స్మగ్లింగ్ ను పూర్తిగా నియంత్రించిందని చెప్పారు. స్మగ్లర్లపై చర్యలు తీసుకుంటున్నప్పుడు జాతీయంగా, అంతర్జాతీయంగా తనపై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు పంపారని గుర్తుచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న తనను అరెస్ట్ చేయించేందుకు కూడా ప్రయత్నించారని, అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టంచేశారు. ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం కూడా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. పవన్ నాటకాలకు స్క్రిప్ట్ లు ఎక్కడినుంచి వచ్చాయో అందరికీ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు.