Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సొంత వూరు నారావారిపల్లెలో కుటుంబసమేతంగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన అయితే సంక్రాంతి పండగ సొంత ఊరిలో జరుపుకుందాం అనుకున్నారు గానీ చంద్రబాబుతో పనిబడ్డ వారికి ఇదే మంచి అవకాశం అనిపించింది. దీంతో వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం బాబు బంధువులు, స్నేహితులు, నారావారిపల్లె దగ్గర్లోని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. దీంతో ఊరంతా రద్దీ రద్దీ గా మారింది. ఈ సమస్యను ముందుగానే ఊహించిన పోలీసు శాఖ కట్టుదిట్టం అయిన ఏర్పాట్లు చేసింది. నారావారిపల్లెకు వచ్చే, వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ని డైవర్ట్ చేసింది.
ఈ ట్రాఫిక్ డైవెర్షన్ వల్ల స్థానికులకు కొద్దిగా ఇబ్బంది తలెత్తింది. నవీన్ అనే అతను కుటుంబ సభ్యులతో పాటుగా ఊరికి బయలుదేరాడు. ట్రాఫిక్ డైవర్షన్ తో ఆయనకు చికాకు వచ్చింది. ప్రయాణం ఆలస్యం అవుతుందన్న కోపంలో అతను చంద్రబాబు రక్షణ సిబ్బందిని నిలదీసాడు. తాము ఎందుకు ఇబ్బంది పడాలని వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో విషయం చంద్రబాబు దగ్గరికి చేరిందట. ఆయన నవీన్ ని పిలిపించారు. నవీన్ ఏమి అనుకుని అక్కడకు వచ్చాడో గానీ చంద్రబాబు మాత్రం కలిగిన ఇబ్బందికి సారీ చెప్పాడు. దీంతో నవీన్ షాక్ తిన్నాడట. సీఎం గా ఏదో పెత్తనం చుపిస్తాడేమో అనుకుంటే ఇలా సారీ చెప్పేసరికి నవీన్ కూడా తన తొందరపాటుకు తిరిగి సారీ చెప్పడమే కాకుండా తానే సర్దుకుపోయి ఉంటే బాగుండేది అన్నాడంట. మొత్తానికి సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యింది. చంద్రబాబు ఏ మాత్రం భేషజానికి పోకుండా సారీ చెప్పడం చూసి నారావారిపల్లె వాసులు అందుకే మా వూరి నాయకుడు గొప్పవాడని చెప్పుకుని మురిసిపోతున్నారు.