సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. సమంత కెరీర్ ఆరంభం నుండి కూడా ఆమె పోషించిన పాత్రలకు డబ్బింగ్ చెబుతూ వస్తుంది. ఈమద్య ‘మహానటి’ చిత్రంలో సమంత పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది, అంతకు ముందు చేసిన తెలుగు మరియు తమిళ చిత్రాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పిన విషయం తెల్సిందే. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ హీరోగా పరిచయం అయ్యి, ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. హీరోగా ఆకట్టుకోలేక పోయిన రాహుల్ రవీంద్రన్ ‘చిలసౌ’ చిత్రాన్ని తెరకెక్కించి మెప్పించాడు, దర్శకుడిగా తన భర్త సక్సెస్‌ను దక్కించుకున్న నేపథ్యంలో ఆనందంతో చిన్మయి ట్విట్టర్‌లో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ సమయంలోనే చిన్మయి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాు చెప్పింది. పలువురు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పిన చిన్మయి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు కొపం తెచ్చుకుంది. ఇంతకు అతడు ఏం ప్రశ్న అడిగాడో తెలుసా.. మీరు ఎప్పుడైనా రాహుల్ రవీంద్రన్‌ను కొట్టారా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా చిన్మయి.. నాకు రోజు వేరే ఏ పని లేదు కనుక, రోజుకు ఒక్కసారి అయినా ఆయన్ను కొడతాను.. అసలేం ప్రశ్న ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్మయి సమాధానంకు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ మాటల్లో కూడా చిన్మయి హింసను భరించలేదు అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.