బాబు దగ్గరకి కాపు ప్రజా ప్రతినిధులు – చిన రాజప్ప బులెట్ పాయింట్స్

chinna rajappa comments on mudragada padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

(వెలగపూడి సచివాలయం లో తనను కలసిన విలేకరులతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చిట్ చాట్ లోని ముఖ్యాంశాలు)

* కాపుల రిజర్వేషన్ల విషయంలో మొసలి  కన్నీరు కారుస్తున్న విపక్ష నేత జగన్ .

*కాపుల సంక్షేమంపై చిత్తశుద్దే గాని ఉండి ఉంటే వైఎస్సార్ ప్లీనరీలో ఎందుకు చర్చించలేదు.

* ఇతర కులాలను బిసిల్లో చేర్చిన వైఎస్సార్ కాపుల రిజర్వేషన్ల కమిషన్ కు నిధులు కూడా కేటాయించలేదు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్దితో కాపుల రిజర్వేషన్లకోసం ప్రయత్నిస్తుంటే ముద్రగడ రాద్దాంతం చేయడం తగదు.

* కాపులను బిసిల్లో చేర్చే సత్తా చంద్రబాబుకే ఉంది.

* శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల ఆటలు సాగనివ్వం.

* తుని సంఘటనకు సంబంధించి కేసును సిబిసిఐడీ పర్వవేక్షిస్తోంది. ఆసంఘటన తో ప్రమేయం ఉన్న వారిని సిఐడిఅరెస్టు
చేస్తుంది.

* ప్రభుత్వ అనుమతి లేనందనే ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకుని గృహనిర్భందంలో ఉంచారు.

* ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనదే ముద్రగడ, జగన్, ల పన్నిన కుట్ర.

* త్వరలోనే కాపు ప్రజా ప్రతినిధులంతా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారు.

* సాధ్యమైనంత త్వరగా మంజునాధ్ కమిషన్ నివేదిక వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతాం.

మరిన్ని వార్తలు

రాహుల్ గాంధీ విలాపం ఎందుకు..?

ఓ సీటూ రేపు రా..!

టీడీపీ కి బలరాం గుడ్ బై ?