Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘సైరా నరసింహారెడ్డి’ రెండవ షెడ్యూల్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇలా ప్రకటించారో లేదో అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఒక లీక్ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరంజీవి నరసింహారెడ్డి గెటప్‌లో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇలాంటివి జరగకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో జాగ్రత్త పడ్డాడు. సెట్స్‌లో ఎవ్వరు కూడా మొబైల్స్ వాడకూడదు అంటూ ముందే హెచ్చరించాడు. అయినా ఎవరో చిరంజీవిని దూరంగా ఫొటో తీసి పోస్ట్ చేశారు.
చిరంజీవి లుక్‌పై ప్రేక్షకులు, ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లుక్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేయాలని, ఫస్ట్‌లుక్ విడుదలతో సినిమాపై అంచనాలు పెంచేలా చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్న సమయంలో ఇలా చిరంజీవి లుక్ రివీల్ అవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారు. ఇందుకు బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని నిర్ణయించుకున్నారు. వారు మరోసారి సెట్స్‌లో కనిపించొద్దంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి జరిగితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు. లీక్ అయిన కొన్ని ఫొటోలను ఇప్పటికే సోషల్ మీడియా నుండి చిత్ర యూనిట్ సభ్యులు తీసేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి, నయనతారల కాంబోలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.