Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ఎన్నో వాయిదాల తర్వాత ప్రారంభం అయిన విషయం తెల్సిందే. మొదటి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు సురేందర్ రెడ్డి రెండవ షెడ్యూల్‌ను ఫిబ్రవరి నుండి ప్లాన్ చేశాడు. కాని రెండవ షెడ్యూల్‌కు అనుకూల పరిస్థితులు కలగడం లేదు. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం కారణంగా సైరా నరసింహారెడ్డి చిత్రంను వాయిదా వేస్తూ వచ్చారు. సైరా సినిమాకు సినిమాటోగ్రఫర్ ‘రంగస్థలం’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉండటంతో వాయిదా తప్పలేదు. ఆ తర్వాత కూడా పలు కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ను మార్చి 5న ప్రారంభించబోతున్నారు. కేరళలోని పలు లొకేషన్స్‌లో చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రెండవ షెడ్యూల్‌లో అమితాబచ్చన్ కూడా పాల్గొనబోతున్నాడు. బిగ్‌బితో పాటు ఇంకా ముఖ్య తారాగణం అంతా కూడా రెండవ షెడ్యూల్‌లో నటించనున్న కారణంగా అందరి దృష్టి ఈ షెడ్యూల్‌పై ఉంది. జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార ఇలా పలువురు స్టార్స్ ఈ చిత్రంలో నటించబోతున్నారు. వచ్చ సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు నిర్మాత రామ్ చరణ్‌లు ప్లాన్ చేస్తున్నారు.