సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రస్తుతం టీటీడీ సభ్యుడు మరియు ఎస్వీ భక్తి ఛానల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో ఎక్కువగా తిరుమల తిరుపతిలోనే ఉంటున్న రాఘవేంద్ర రావు కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో అక్కడ మీడియా మరియు జనాలు కాస్త హడావుడి చేశారు. అయితే కారులో యాక్సిడెంట్ సమయంలో రాఘవేంద్ర రావు లేడు అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. టీటీడీ ప్రత్యేక వాహనంను రాఘవేంద్ర రావుకు ఇవ్వడం జరిగింది. ఆ కారుకు యాక్సిడెంట్ అనగానే అంతా కూడా కంగారు పడ్డారు. కాని ఆ సమయంలో ఆయన తన సొంత కారులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా హైదరాబాద్ నుండి తిరుపతి చేరుకున్న రాఘవేంద్ర రావు టీటీడీ వారు ఇచ్చిన కారులో కాకుండా తన సొంత కారులో కొండపైకి బయలుజేరారు. ఆ సమయంలోనే టీటీడీ ప్రత్యేక వాహనం కూడా రాఘవేంద్ర రావు సొంత కారుతోనే ఉంది. ముందు టీటీడీ వారు సమకూర్చిన వాహనం వెళ్తుండగా అందులో రాఘవేంద్ర రావు మేనేజర్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వెనక రాఘవేంద్ర రావు ప్రయాణిస్తున్నారు. రెండు కార్లు ఒకదాని వెనుక వెళ్తున్నాయి. ఆ సమయంలోనే ముందు ఉన్న టీటీడీ ప్రత్యేక వాహనం యాక్సిడెంట్‌కు గురైంది. దాంతో అందులో ఉన్న డ్రైవర్‌తో సహా పలువురు గాయాల పాలయ్యారు. రాఘవేంద్ర రావు ఆ కారులో ఎక్కి ఉంటే ఆయనకు కూడా తీవ్ర గాయాలు అయ్యేవి, పెను ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి రాఘవేంద్ర రావు యాక్సిడెంట్ నుండి తప్పించుకోవడంతో ఆయన సన్నిహితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక యాక్సిడెంట్‌లో గాయాలైన వారు తిరుపతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.