టాలీవుడ్‌లో థియేటర్ల బంద్‌ ప్రభావం ఎంత?

Cinema Theaters Bandh in South India

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సౌత్‌ ఇండియా మొత్తం నేటి నుండి సినిమా హాల్స్‌ మూత పడనున్నాయి. డిజిటల్‌ ప్రొవైడర్ల తీరుకు వ్యతిరేకంగా టాలీవుడ్‌ నిర్మాతలు మరియు థియేటర్ల యాజమాన్యాలు బంద్‌కు సిద్దం అయిన విషయం తెల్సిందే. గత కొంత కాలంగా ఈ విషయమై చర్చలు జరుపుతున్నా కూడా డిజిటల్‌ ప్రొవైడర్లు స్పందించని కారణంగా బంద్‌కు మొగ్గు చూపుతున్నట్లుగా సౌత్‌ ఇండియా నిర్మాతల తరపున సురేష్‌బాబు ప్రకటించాడు. నేటి నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా పరిశ్రమల థియేటర్లు కూడా బంద్‌ను పాటించబోతున్నాయి. ఇతర రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ ప్రభావం అంతంత మాత్రమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌కు ఎప్పుడైన మార్చిలో సీజన్‌ ఉండదు. పరీక్షల సీజన్‌ అవ్వడంతో మార్చిలో పెద్ద సినిమాలు విడుదల ఉండదు. అందుకే ఈ బంద్‌ సినిమాలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బాక్సాఫీస్‌ వద్ద ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఇటీవల విడుదలైన చిన్న చిత్రాలు కూడా తమ స్థాయికి తగ్గట్లుగా వసూళ్లు రాబట్టాయి. నేడు విడుదల కావాల్సిన చిత్రాలు ఏమీ లేవు. దాంతో టాలీవుడ్‌కు బంద్‌ వల్ల పెద్దగా ప్రభావం లేదు. మార్చి చివర్లో మరియు ఏప్రిల్‌లో పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అప్పటికి ఈ బంద్‌ పూర్తి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి ఈ బంద్‌ వల్ల ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారికి ఏమీ నష్టం లేదు. సురేష్‌బాబు అండ్‌ కో చాలా జాగ్రత్తగా ఆలోచించి మార్చిలో బంద్‌ను ప్లాన్‌ చేసినట్లుగా కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.