సూపర్ స్టార్ మహేష్‌బాబు మొన్న వేసవిలో ‘భరత్ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో చేరింది. అంతకు ముందు రెండు వరుస ఫ్లాప్‌ల తర్వాత మహేష్‌బాబు భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్ కొట్టాడు. ఇక ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం గురించి అంతా చర్చించుకుంటున్నారు. మహేష్‌బాబు ప్రతిష్టాత్మక, మైలురాయి చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్‌లుక్‌పై క్లారిటీ వచ్చేసింది.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మహేష్‌బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే రోజున లేదా ముందు రోజున టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ఒక టైటిల్‌ను దర్శకుడు అనేసుకున్నాడు. దానికి మహేష్‌బాబుతో పాటు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. త్వరలో రెండు బ్యానర్లు సంయుక్తంగా చిత్ర టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించబోతున్నాయి. టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో వంశీ పైడిపల్లి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు రైతు నాయకుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.