Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మియాపూర్ ల్యాండ్ స్కామ్ తర్వాత తెలంగాణ సర్కారు వెన్నులో వణుకు మొదలైంది. తీగ లాగితే హైదరాబాద్ లో ఉన్న అక్రమార్కలు డొంక కదిలింది. ప్రైవేట్ భూములు తర్వాతి సంగతి.. ముందు ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతం కావడం సర్కారుకు మింగుడు పడలేదు. ఏకంగా సబ్ రిజిస్ట్రార్లే అక్రమాలు చేసి, అక్రమార్కులకు సహకరించి కోట్లు కూడబెట్టుకోవడం అందర్నీ నివ్వెరపరిచింది.
డ్రగ్స్ కేసు పుణ్యమా అని ల్యాండ్ స్కామ్ మరుగునపడినా.. ఇప్పుడు మళ్లీ భూరికార్డుల ప్రక్షాళన అంటూ తేనెతుట్టెను కదిలిస్తున్నారు కేసీఆర్. రైతులకు పెట్టుబడి పథకం కోసమే ఈ సర్వే అని చెబుతున్నారు. కానీ రైతులకు డబ్బులివ్వడానికి.. పొలాల సర్వే చేస్తే సరిపోతుంది.. కానీ భూముల సర్వే అవసరం లేదు. కానీ ఇక్కడే కేసీఆర్ మార్క్ నిర్ణయాలు బయటపడుతున్నాయి. ఈ వంకతో అన్నింటినీ సెట్ రైట్ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు.
కానీ ఆ పని కేసీఆర్ అనుకున్నంత వీజీ కాదనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే చాలా భూములు టీఆర్ఎస్ నేతల స్వాధీనంలో ఉన్నాయి. వారికి సహకరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో వారెవరూ పార్టీకి పనిచేయరు. అప్పుడు ఓట్లు రావు. అందుకే కేసీఆర్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కానీ తమ పార్టీ వారిని వదిలేసి.. మిగతా వారి పని పట్టాలనే కోణంలో ప్రభుత్వ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు: