Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో పొలిటికల్, సినీ, ఐటీ, స్పోర్ట్స్ లింకులు కూడా బయటపడ్డాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా టాలీవుడ్ ను మాత్రమే టార్గెట్ చేసింది. మీడియాకు కూడా కావల్సినంత మసాలా దొరికింది కాబట్టి ఏకి పడేస్తోంది. ఐతే సినీ రంగంతో పోలిస్తే ఐటీలోనే డ్రగ్స్ లింకులు ఎక్కువున్నాయని వినిపిస్తోంది.
ఐతే హైదరాబాద్ అంటే ఐటీకి బ్రాండ్ ఇమేజ్ కాబట్టి.. ఆ పేర్లు బయటకు రాకుండా సర్కారు మేనేజ్ చేస్తోందట. వీలైనంత వరకు కంపెనీల పేర్లు కూడా బయటపెట్టొద్దని, కౌన్సెలింగ్ తో సరిపెట్టాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఐటీ డ్రగ్స్ లింకులు బయటపడితే.. పెట్టుబడులు ఎవరూ పెట్టరనేది కేసీఆర్ భయం.
ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే.. ఐటీ కంపెనీలు ఠంచనుగా పన్నులు చెల్లిస్తాయి. ఎగ్గొట్టినా మైనర్ షేరే ఉంటుంది. కానీ సినీ పరిశ్రమ అలా కాదు. మేజర్ షేర్ ఎగ్గొట్టి.. మైనర్ షేర్ వరకే పన్నులు కడుతోంది. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం అబ్జర్వ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం సమయం చూసి దెబ్బ కొడుతుందనేది ఇన్ సైడ్ టాక్.
మరిన్ని వార్తలు: