Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో తిరుగులేదని విర్రవీగుతున్న టీఆర్ఎస్ కు సర్వే ఫలితాలు దిమ్మ తిరిగేలా వస్తున్నాయి. సీఎం ఇమేజ్ పెరుగుతున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రాఫ్ మాత్రం దారుణంగా పడిపోతోంది. దాదాపు 60 శాతం ఎమ్మెల్యేలు, 75 శాతం ఎంపీలపై వ్యతిరేకత ఉందని తేలడంతో.. కేసీఆర్ షాకౌతున్నారు. కేసీఆర్ ఒక్కరే ఇమేజ్ పెంచుకుంటే ఆయన ఒక్కరే గెలుస్తారని, మిగతా సిట్టింగులంతా బుక్కౌతారని సర్వేలు తేల్చిచెబుతున్నాయి.
దీంతో కలవరానికి గురైన కేసీఆర్.. ప్రజాప్రతినిధులతో త్వరలోనే సమావేశం పెట్టి.. తలంటారని డిసైడయ్యారు. కానీ ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మూడేళ్లుగా కేసీఆర్ చాలాసార్లు తన సహచరులకు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని చెప్పారు. కానీ ఎవరూ తమ పనితీరు మార్చుకోలేదు. ఎన్నికలకు గట్టిగా ఏడాదిన్నరే సమయం ఉంది. ఇప్పుడు సిట్టింగులకు క్లాసు పీకినా, ఎన్నికల్లో వాళ్లకు టికెట్లు ఇవ్వకపోయినా.. క్యాడర్ వ్యతిరేకంగా పనిచేసి.. ఫలితాలు తలకిందులు చేస్తుందనే భయం కేసీఆర్ ను వెంటాడుతోంది.
మరిన్ని వార్తలు: