కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోన్న కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఎంపీలు, మంత్రులతో సమావేశం జరిగింది. అనంతరం ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. ప్రధాని స్పందించకపోతే 24న కడపలో ఆమరణ దీక్ష చేపడతామని ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపమని మరింత ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర సర్కారు పాత నివేదికతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని రమేష్ పేర్కొన్నారు.