అయ్యో… సునీల్‌ ఇలా తీసుకుంటున్నాడా?

Comedian Sunil Remuneration for a Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సునీల్‌ ఆ తర్వాత హీరోగా మారాడు. ‘అందాల రాముడు’ సినిమాతో పాటు పలు చిత్రాల్లో హీరోగా నటించిన సునీల్‌ వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు. దాంతో మళ్లీ ఆయన కమెడియన్‌గా మారిన విషయం తెల్సిందే. సైరాతో పాటు పలు చిత్రాల్లో సునీల్‌ కమెడియన్‌గా నటిస్తున్నాడు. గతంలో మాదిరిగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుసగా కమెడియన్‌ పాత్రలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవలే సిల్లీ ఫెలోస్‌ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయిన సునీల్‌ తీసుకుంటున్న పారితోషికం గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సునీల్‌ గతంలో ఫర్‌డే రెమ్యూనరేషన్‌ తీసుకునేవాడు. ప్రస్తుం మళ్లీ అదే స్థాయికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సునీల్‌ హనురాఘవపూడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు గాను రోజుకు 3.75 లక్షల పారితోషికంను అందుకుంటున్నాడు.

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న సైరా చిత్రం కోసం సునీల్‌ ఎక్కువ రోజులు షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. అయినా కూడా కేవలం 60 లక్షలు మాత్రమే పారితోషికంగా అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కోట్లలో పారితోషికం తీసుకున్న సునీల్‌ ప్రస్తుతం లక్షల్లో పారితోషికం కూడా తీసుకునే పరిస్థితి లేదు. సిల్లీ ఫెలోస్‌ సినిమాకు దాదాపుగా కోటి రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కాని అందులో నిజం లేదని, అల్లరి నరేష్‌ తీసుకుంటున్న పారితోషికంలో సగం మాత్రమే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సునీల్‌ పారితోషికం విషయంలో చాలా డల్‌ అయ్యాడని, సినిమా పరిశ్రమలో ఇలాంటివి అన్ని కామన్‌ అని, కాకుంటే సునీల్‌ మరీ ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదని ఆయనను అభిమానించేవారు, ఆయన సన్నిహితులు అంటున్నారు.