Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన ఏర్పడి నాలుగేళ్లు అయిన సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మీద ఇటు విమర్శలు, అటు పొగడ్తలు వస్తున్నాయి. అయితే విమర్శించే వాళ్ళు టీడీపీ అభిమానులు, పొగడ్తలు కురిపించిన వాళ్ళు వైసీపీ కిదగ్గరగా వున్నవాళ్లు. ఇక ఏ పార్టీ తో అంటకాగకుండా అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే సామాన్యులు చాలా మంది వుంటారు. ఏ పార్టీ గెలుపు ఓటములని అయినా నిర్దేశించేది వీళ్ళు మాత్రమే. ఇప్పుడు పవన్ ప్రసంగం మీద ఈ న్యూట్రల్ సెక్షన్ అభిప్రాయం ఎలా వుందో తెలుసుకోడానికి తెలుగు బులెట్ ప్రయత్నించింది. ఆ క్రమంలో వచ్చిన సమాధానాలు చూస్తే సామాన్యులకు రాజకీయాలు పెద్దగా తెలియవు అనుకోవడం పెద్ద భ్రమ అని తేలిపోయింది.
జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేస్తూ పవన్ మాట్లాడిన దాంట్లో తప్పొప్పులు పక్కనబెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సహా వివిధ ముఖ్య అంశాలను టచ్ చేసి వదిలివేయడం ఏంటన్న ప్రశ్న ఎదురైంది. పవన్ మాటల్లో నిజం ఉందనుకున్నా ఇప్పుడు అది మాట్లాడే సందర్భం కాదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేయడం వల్ల ప్రధాని మోడీ కి పరోక్షంగా సహకరించినట్టే అని న్యూట్రల్ గా వుండే జనాలు అంటున్నారు. హోదా సహా కేంద్ర సాయం మీద పోరాడాల్సిన తరుణంలో పవన్ ప్రసంగం మొత్తం రాజకీయ వాతావరణాన్ని పక్కదారి పట్టించిందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆ విధంగా పవన్ కొట్టిన షాట్ లో టైమింగ్ మిస్ అయ్యింది.