కాంగ్రెస్ మార్కు రాజకీయం అంటే ఇదేనేమో ?

తెలంగాణలో ఉన్న మొత్తం 119 స్థానాలలో కాంగ్రెస్ 25 స్థానాలను కూటమిలోని మిత్రపక్షాల కు ఇస్తున్నట్టుగా కూటమి ఏర్పాటు చేసిన కొత్తలో ప్రకటించింది . తాము కేవలం 94 స్థానాలలో పోటీ చేస్తామని గతంలో చెప్పింది. అయితే చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ తనదైన శైలిలో మిత్రపక్షాలకు పంచ్ ఇచ్చింది. పొత్తులో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేసి, మిగతా సీట్లను తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అనూహ్యంగా 100 స్థానాలకు బీఫామ్ లు ఇచ్చింది. నేటి ఉదయం ఉత్తమ్ కుమార్ మరో ఆరు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతూ వారికి బీఫామ్ లు ఇచ్చారు.

uttam kumar reddy

దీంతో కాంగ్రెస్ మొత్తంగా వంద సీట్లకు పోటీ చేస్తున్నట్లు అయింది. అది కాకుండా మిత్రపక్షాలకు ఇచ్చిన 19 సీట్లలో లో కూడా దాదాపు 7 సీట్లు ఎంఐఎం పార్టీ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు. అంటే కాంగ్రెస్ పార్టీ వదులుకున్న స్థానాలు కేవలం 12 అన్నమాట. గతంలో ఇబ్రహీంపట్నం స్థానాన్ని టిడిపికి కేటాయిస్తూ ప్రకటన ఇచ్చింది. టిడిపి అధ్యక్షుడు రమణ, సామ రంగారెడ్డికి ఇక్కడ నుంచి బి ఫాం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మల్ రెడ్డి కి కేటాయిస్తూ బి ఫాం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే కోదండరాం టీజేఎస్ పార్టీకి కేటాయించిన ఐదు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది.

r.krishnaiah

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం నేత కృష్ణయ్య కు టికెట్ ఇచ్చింది. ఇది గతంలో టీజేఎస్ పార్టీకి కేటాయించిన సీటు. అలాగే వరంగల్ లో కాంగ్రెస్ టీజేఎస్ పోటీకి నిలబడుతున్న గా, మహబూబ్ నగర్ లో టిజెఎస్, టి డి పి పోటీపడుతున్నాయి. పైకి స్నేహపూర్వక పోటీ అని చెబుతున్నప్పటికీ అన్ని పార్టీల అభ్యర్థుల అంతిమ లక్ష్యం విజయమే కాబట్టి అభ్యర్థులు విజయం సాధించడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తారు. మొత్తానికి ఈ మహా కూటమి ఇటువంటి ఫలితాలనిస్తుందనేది ఫలితాల తర్వాతే తెలుస్తుంది.