Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Congress Party Cadre Fires on Uttam Kumar Reddy & Jana Reddy
తెలంగాణలో టీఆర్ఎస్ బలహీనపడుతోందన్న సంకేతాలు అందాయో లేదో.. కాంగ్రెస్ నేతలు మొదలెట్టేశారు. పాత బాణీకి వెళ్లిపోయి వర్గపోరుకు తెరతీశారు. డిల్లీ పెద్దలు తలంటినా ఉత్తమ్, జానాకు బుద్ధి రాలేదు. అసలు అసెంబ్లీలో నోరు లేవని జానారెడ్డి.. ఇలాంటి విషయంలో మాత్రం ముందుంటారని ఉత్తమ్ సెటైర్లేస్తున్నారు. కానీ సీనియర్లు మాత్రం జానాకే సపోర్టట. తమ ముందు పిల్లకాకిగా తిరిగిన ఉత్తమ్ సీఎం అయితే ఎలాగని వారి బాథ.
అసలు కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికీ తెలీదు. కానీ నేతలు మాత్రం తెగ ట్రై చేస్తున్నారు. సీఎం కుర్చీ కోసం పోటీలు పడుతున్నారు. ఏఐసీసీ నేతలుక అప్పుడే కావాల్సినంత ముట్టజెబుతామంటున్నారు. అంటే నేతల దగ్గర డబ్బులుండీ తీయడం లేదనే విషయం హస్తినకు న్యూస్ వెళ్లిపోయింది. దీంతో ఇక ఎవరి దగ్గర ఎంత వసూలు చేయాలో ఫిక్సయ్యారు అధిష్ఠానం దూతలు..
అటు సోనియా కూడా వీరి వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు. జానా, ఉత్తమ్ కలిసి పనిచేస్తేనే గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుంటే.. వీరిద్దరూ పోటీలు పడుతూ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆమె భావిస్తున్నారు. అందుకే రాహుల్ ద్వారా గట్టిగా క్లాస్ పీకించాలని భావిస్తున్నారట.
మరిన్ని వార్తలు: