Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ కు ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్ సీజన్ లీడర్లు రెడీగా ఉంటారు. మాజీ క్రికెటర్లు, సినీతారలను స్టాక్ పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ.. వారిని అవసరమైనప్పుడే బయటకు తీస్తోంది. ఒక్కోసారి వాళ్లు అనూహ్యంగా గెలిచేస్తూ ఉంటారు. అలాంటి లీడర్లే అజారుద్దీన్, రాములమ్మ. ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నెగ్గుకొచ్చిన నేత అజారుద్దీన్ అయితే.. రాములమ్మ సంగతి ఎవరికీ చెప్పాల్సిన అవసరమే లేదు. అజారుద్దీన్ ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ లో కనిపిస్తున్నారు. ఇటీవలే హెచ్ సీఏ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. వివేక్ ప్యానెల్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన్ను హైదరాబాద్ ఎంపీ సీటు బరిలో దించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పాతబస్తీ యూత్ లో కూడా అజ్జూభాయ్ కు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటోంది. తెలంగాణ ఉద్యమానికి అయితే మొదట్లో రాములమ్మ గ్లామరే బాగా ఉపయోగపడింది. ఒసేయ్ రాములమ్మగా జీవించిన విజయశాంతి స్క్రీన్ నేమ్ తోనే తెలంగాణ ప్రజల గుండెల్లో తిష్ట వేసింది. కేసీఆర్ స్వయంగా ఆమెను ఆహ్వానించి పార్టీలో తనతో సమానంగా విలువ ఇచ్చారంటే… అప్పట్లో రాములమ్మ క్రేజేంటో అర్థమవుతోంది. కానీ స్వీయ తప్పిదాల కారణంగా తెరమరుగైన రాములమ్మ.. మళ్లీ వరంగల్ బరిలో నిలిస్తే బాగుంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎన్నికల సీజన్ లీడర్లను జనం ఎంతవరకు నమ్ముతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
మరిన్ని వార్తలు: