కేంద్రంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం

Congress Party Issued No Confidence Motion Notice Against BJP Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆరు రోజులుగా టీడీపీ , వైసీపీ అవిశ్వాస తీర్మానాలు లోక్ సభలో చర్చకు నోచుకోని ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు టీడీపీ, వైసీపీ తీర్మానానికి మద్దతు గా నిలవడానికి పరిమితం అయిన కాంగ్రెస్ ఇంకో అడుగు ముందుకు వేసింది. ఈ నెల 27 న లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరం అయిన నోటీస్ ఇచ్చారు ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.

అవిశ్వాసం చర్చకు రాకుండా అన్నాడీఎంకే , తెరాస లని ముందు పెడుతున్న బీజేపీ ని ఢీకొట్టడానికి కాంగ్రెస్ నేరుగా రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా టీడీపీ , వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చూసిన బీజేపీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తీర్మానాన్ని ఒప్పుకుంటుందని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేసింది.

సభ సంప్రదాయాలను పక్కన బెడుతూ ప్రధాని మోడీ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం బీజేపీ కి పెద్ద షాక్. త్రిపురలో సీనియర్ నేత అద్వానీని మోడీ అవమానించారు అన్న చర్చ జోరుగా సాగుతున్న వేళలో కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా బీజేపీ లోని మోడీ వ్యతిరేకులు నిర్ణయం తీసుకోవచ్చన్న అనుమానం కూడా మోడీ , షా కి ఉందట. టీడీపీ , వైసీపీ అవిశ్వాస తీర్మానాల విషయంలో ఆ ఇద్దరు అంత పట్టుదలగా వ్యవహరించడానికి అదే కారణం అట. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ రంగంలోకి దిగడంతో ఇంకా అవిశ్వాసం నుంచి తప్పుంచుకోడానికి వున్న అవకాశాలు తక్కువే.

ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టినా ఇప్పటిలాగే సభ వాయిదా వేసుకుపోతే దేశవ్యాప్తంగా అపప్రధ తప్పకపోవచ్చు. అందుకే కాంగ్రెస్ చెప్పినట్టు ఆ పార్టీ విసిరిన అవిశ్వాస ఛాలెంజ్ ని ఇష్టం వున్నా ,లేకపోయినా స్వీకరించక తప్పని పరిస్థితి బీజేపీ ది.