భీకరంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్

భీకరంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్

గత కొంత కాలంగా మహమ్మారి కరోనా వైరస్ దాదాపుగా ప్రపంచ దేశాల ప్రజలందరినీ కూడా వణికిస్తుంది. ఈ వైరస్ ని అడ్డుకోవడానికి ఎన్నో ఖఠినమైన చర్యలు తీసుకుంటూ, నివారణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ వైరస్ భీకరంగా వ్యాపిస్తుంది. కాగా ఈ వైరస్ వలన ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఈ వైరస్ కి సంబందించిన లక్షణాలు ఇంకా కొన్ని లక్షల మందిలో సజీవంగానే ఉన్నాయి. ఇకపోతే ఈ వైరస్ కి సంబంధించి మనందరిలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఎవరైనా చనిపోతే, ఆ మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు జరగనీయకుండా స్థానికులు అడ్డుకుంటూ, వారి స్థలాలకు కూడా రానీయడం లేదు. ఎందుకంటే ఆ మృతదేహం వలన వారందరికీ కూడా కరోనా వ్యాపిస్తుంది అడ్డుకుంటున్నారు.

అయితే ఈ విషయం పైన కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్, కొవిడ్‌-19 సలహా కమిటీ సభ్యుడు, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికి ఒక వివరణ ఇచ్చారు. కాగా కరోనా కారణంగా మరణించిన వారి శరీరంలో నుండి కరోనా వైరస్ ని మొత్తం పంపించాకే, ఆ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అందుకు గాను హైపోక్లోరైడ్ వాడుతున్నారు. అయితే ఆ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మృతదేహం లోకి పంపించి, ఆ తరువాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి, జిప్ కవర్ తో మూసేస్తారు. తల భాగం ఒక్కటి మాత్రమే బయటకు కనబడేలా పారదర్శకమైన కవర్ ఏర్పాటు చేస్తారు. ఇక చివరగా, ఆ మృతదేహాన్ని ఒక గుడ్డతో చుట్టూ మూసేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మృతదేహం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని, దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అంత్యక్రియలకు ఎలాంటి అడ్డు చెప్పకూడదని కోరుకున్నారు.