తెలుగుదేశానికి కలిసి రాని సైకిల్ యాత్ర !

Cycle Yatra of TDP Is failing due to leaders

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ అధికార పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్ళలేకపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత చంద్ర బాబు వేస్తున్న అడుగుల‌కు దీటుగా వారు ముందుకు సాగ‌లేక పోతున్నారు. వారికి అధినేత ప్రవేసపెట్టిన సైకిల్ యాత్ర అంతగా కలిసి వచ్చినట్టు లేదు దాంతో ఎక్క‌డిక‌క్కడ నేత‌లు అనారోగ్యానికి, అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. ఫ‌లితంగా టీడీపీ నేత‌లు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు మధ్యంతరంగా ఆగిపోతున్నాయి. పార్టీ త‌ర‌ఫున తెలుగుదేశం నాయకులందరికీ పెద్ద ఎత్తున టార్గెట్లు పెట్టారట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైకిల్ ర్యాలీలు నిర్వహించక తప్పని పరిస్థితి దాంతో రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు సైకిల్ యాత్ర‌లు చేప‌ట్టారు. అయితే, కొన్ని చోట్ల ఈ యాత్ర‌ల్లో అప‌శ్రుతులు దొర్లుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం సైకిల్‌ యాత్రలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు గాయాలపాలవ్వగా అనంతరం కొన్ని రోజులకి ఏపీ ప్రభుత్వ చీఫ్ వీప్ పల్లె రఘునాథరెడ్డికి కూడా గాయాలైన విషయం తెలిసిందే. తాజాగా ఏలూరులో ఎంపీ మాగంటి బాబు చేప‌ట్టిన సైకిల్ యాత్ర‌లో గుండెపోటు వచ్చి ఆస్ప‌త్రి పాల‌వ‌డం కూడా జరిగింది. అలాగే తాజాగా అయితే, ఇప్ప‌డు తాజాగాధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. ఇక నిన్న సైకిల్ యాత్ర చేసేందుకు వెళ్తూ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు యువనేత విజయ్ గాయాల పాలయ్యాడు. ఇంత మంది నేతలకి జరిగిన ఈ పరిణామాలు చూసి ఈ సైకిల్ యాత్ర తెలుగుదేశానికి కలిసి రాలేదు అని తెలుగు తమ్ముళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట.