Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
●వాతావరణ మార్పులతో భారీ గాలులు, వర్షాలుప్రజల్లో చైతన్యం తేవాలంటున్న నిపుణులు
రానున్న రోజుల్లో కోస్తా జిల్లాలపై ప్రకృతి వైపరీత్యాలు ప్రభావం చూపనున్నాయి.
అక్టోబరు ప్రారంభంనుంచి డిసెంబరులోగా మూడు తీవ్రమైన తుపాన్లు బంగాళాఖాతం సముద్రతీరంలో గోదావరి జిల్లాలను ఆనుకుని ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది.
ఇప్పటికే ఇస్రోతోపాటు వివిధ సంస్థలు తీవ్రమైన తుపాన్లు, సునామీవంటి వైపరీత్యాలు కోస్తా జిల్లాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేశాయి.
అయితే నవంబరు వస్తే ప్రకృతి వైపరీత్యాలు జిల్లాపై తీవ్రమైన ప్రభావం చూపిన గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజానీకం వేడుకుంటోంది.
అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలపై ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా పగబట్టాయి.
వాతావరణంలో వస్తున్న అనూహ్యమైన మార్పులతో వరదలు, సూపర్సైక్లోన్ లతోపాటు సునామీ వంటి ప్రమాదకర పరిస్థితులను ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లోని బంగాళాఖాతం తీరంలో తీవ్రమైన మూడు తుపాన్లు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఇస్రో పరిశోధనా కేంద్రంలోని నిపుణుల బృందం హెచ్చరికలు జారీచేసింది.
అమెరికాలో వచ్చిన తుపాన్ల మాదిరిగా భారత్లో అక్టోబరు ప్రారంభం నుంచి డిసెంబరు మొదటివారంలోపుగా ఈ తుపాన్లు ప్రభావం చూపే అవకాశం ఉందని, అలాగే సునామీలు కూడా వచ్చే పరిస్థితులున్నాయని హెచ్చరికలు జారీచేస్తున్నారు.
నిపుణుల హెచ్చరికలు
ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని బీకే రీసెర్చ్ అసోసియేషన్ ఫర్ ఈఎ్సపీ (ఎర్త్ అండ్ స్పేస్ ప్రిడిక్షన్) సంస్థకు చెందిన డైరెక్టర్ బాబు కలియల్ ఈనెల 20న ప్రధానమంత్రి మోదీకి ఒక లేఖ రాశారు.
ఆ లేఖలో ఇండియాలో ప్రభావం చూపే దిగ్ర్భాంతికరమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఏడాది డిసెంబరు 31లోగా తీవ్రమైన భూకంపం ఇండియాపై ప్రభావం చూపుతుందన్నారు.
కోస్టల్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం కారణంగా సునామీలు కూడా సంభవిస్తాయని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ప్రపంచంలోని ఇండియా, చైనా, జపాన్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంకతోపాటు గల్ఫ్ దేశాలపై భూకంపం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేయాలని ప్రధానమంత్రికి రాసిన లేఖ లో బాబు కలియల్ వివరించారు.
అలాగే సిస్మా తుపాను ప్రభావం కోస్టల్ రాష్ట్రాలపై ఉంటుందని, 120నుంచి 180 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షాలతోపాటు సముద్రతీరంలో ఉవ్వెత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
దీంతోపాటు దేశ, ప్రపంచదేశాల్లో ఉన్న వాతావరణ కేంద్రాలు సైతం మూడు తుపాన్ల ప్రభావంపై హెచ్చరికలు జారీచేస్తుండడంతో కోస్తాలోని బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.