జనసేనలోకి ‘దాడి కుటుంబం..ఆ కారణంతోనేనా..?

Dadi Veerabhadra Rao
Dadi Veerabhadra Rao

సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైసీపీ పక్కన పెట్టిందా? ఆయన అవసరం లేకుండానే అనకాపల్లిలో గెలవాలని చూస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నాలుగేళ్ల కిందట ముచ్చటపడి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు వైసీపీ లో చేరారు .కానీ అనకాపల్లి అసెంబ్లీ సీటును ఆ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయారు.

దాడి వీరభద్రరావుకు ఎటువంటి పదవి దక్కకుండా మంత్రి గుడివాడ అమర్నాథ్ అడుగడుగునా అడ్డు తగలడం వల్లే టాక్ .దాడి వీరభద్రరావు జగన్ వెంట నడిచారని ,టిడిపిలో గౌరవమైన స్థానాన్ని వదులుకొని మరి , కానీ పెద్దాయనకు ఎటువంటి గౌరవం దక్కలేదు.కుమారుడు రత్నాకర్ కు మంచి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని వీరభద్రరావు భావించారు. కానీ వైసీపీలో అడుగడుగునా వారికి అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో దాడి వీరభద్రరావు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ సైతం దాడి వీరభద్రరావును పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది.ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన దంతులూరి దిలీప్ కుమార్ కు జగన్ పిలిచి మరి కీలకమైన నామినేటెడ్ పదవి కట్ట పెట్టారు.ఏకంగా ఆయనకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిని చేశారు. అందరికీ అన్నీ ఇస్తున్నా దాడి వీరభద్రరావు విషయంలో మాత్రం జగన్ మొండి చేయి చూపుతున్నారు. దీంతో వారు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పవన్ తో సన్నిహిత సంబంధాలు ఉండడమే అందుకు కారణం. కొద్ది రోజుల్లో దాడి కుటుంబం రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.