అమృత…మారుతీరావు…ఓ పూజ !

Daughter Donated Liver Issues To Her Dad

ప్రేమించి పెళ్లాడిన ప్రణయ్ ఇక లేడనే విషయం తెలియగానే అమృత ప్రణయ్‌‌ను నరికి చంపించిన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. హంతకుడు తన తండ్రైనా సరే ఉరి తీయాల్సిందే అని అమృత స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వార్తకు అమృతకు సంబంధం లేకపోయినా తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న తేడా చదువరులకి తెలియడానికే అమృత ఉదంతం ప్రస్తావించాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళితే కొందరు బతికున్నప్పుడే డబ్బుల అవసరం ఉంటే కిడ్నీ, లివర్ లాంటి అవయవాలను కొంతమంది అమ్ముకుంటుంటారు.

puja and father

కానీ సొంత తండ్రి కోసం ఓ కూతురు తన లివర్ ను దానం చేసి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ముంబైకి చెందిన పూజ బిజార్నియా తన తండ్రికి లివర్ ను దానం చేసింది. తన తండ్రికి లివర్ చెడిపోవడంతో తన లివర్ ఇచ్చి తనకు లైఫ్ ఇచ్చిన తండ్రిని కాపాడుకొని అసలు సిసలు కూతురనిపించుకున్నది పూజ. ఇప్పుడు ఈ రెండు విషయాలను ఎందుకు కంపేర్ చేసి చెబుతున్నామంటే తనను చిన్నప్పటి ఏది అడిగితే అది తెచ్చివ్వడానికి తన చిన్న చిన్న సంతోషాలను కూడా వదులుకుని డబ్బు సంపాదించి ఆమెని గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకునే లోపు ఆమె వేరే వ్యక్తి ప్రేమలో పడి కన్నా వాళ్ళను దూరం చేసుకుని వెళ్ళిపోయింది అమృత. అదే సమయంలో అదే ప్రేమగా పెంచుకున్న తండ్రికి తన లివర్ లో భాగం దానం ఇచ్చి బతికిన్చుకున్నది మరో కూతురు. ఇక్కడ మారింది ప్రేమ కాదు, ప్రేమ పేరుతో మనం పెంచుకుంటున్న అంతరాలు.