Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒంటరి స్త్రీ కి రక్షణ లేదని ఇన్నాళ్లుగా బాధపడుతుంటే… ఇప్పుడు ఇంకో రకమైన సమస్య తెచ్చిపెట్టింది ఓ హైదరాబాద్ హోటల్. నుపుర్ సరస్వత్ అనే NRI మహిళ ఓ పని మీద హైదరాబాద్ వచ్చారు. బస కోసం ముందుగానే గో ఇబిబో ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నారు. ఆమె బడ్జెట్ కి తగ్గట్టు సదరు సంస్థ ఎర్రగడ్డ లోని డెక్కన్ ఎర్రగడ్డ అనే హోటల్ లో గది కేటాయించింది. సరస్వత్ ఆ హోటల్ కి వెళ్లి నిర్వాహకులు ఇచ్చిన సమాధానంతో తెల్లబోయింది. స్థానికులు, పెళ్లి కాని వారు, ఒంటరి స్త్రీలకు రూమ్ లు ఇచ్చే ప్రసక్తి లేదని నిర్వాహకులు చెప్పడంతో సరస్వత్ షాక్ కి గురి అయ్యింది. వారితో వాగ్వాదం జరిగినా ప్రయోజనం లేకపోవడంతో మొత్తం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పింది. ఒంటరి మహిళకు కనీసం గది తీసుకునే అర్హత లేదా అని ఆశ్చర్యపోతూ గో ఇబిబో కి సమాచారం ఇచ్చింది.
సరస్వత్ కి కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పిన గో ఇబిబో వెంటనే ఆమెకి ఉచితంగా అంతకంటే మంచి హోటల్ లో వసతి సదుపాయం కల్పించింది. సరస్వత్ పోస్ట్ కి స్పందించిన నెటిజెన్ల డెక్కన్ ఎర్రగడ్డ హోటల్ మీద ఫైర్ అయ్యారు. ఒంటరి స్త్రీలంటే తప్పు చేసే వారేనా అని నిలదీశారు. అటు గో ఇబిబో సంస్థ కూడా తమ జాబితా నుంచి సదరు హోటల్ పేరు తప్పించింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరి మహిళలకు ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకు తమ కస్టమర్స్ కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
మరిన్ని వార్తలు