Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్థానం…2010లో వచ్చిన ఈ సినిమా నిజంగా ఓ చరిత్ర. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడలేదేమోకానీ…అంతకుమించిన సంచలనాలను నమోదుచేసింది. విమర్శకుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలందుకుంది. రివ్యూలన్నింటిలో సినిమాకు పాజిటివ్ స్పందన వచ్చింది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాను డైరెక్టర్ దేవకట్టా మలిచిన తీరు అద్వితీయం. ప్రస్థానం సినిమాకు డైలాగులే పెద్ద ఎసెట్. ఒక్కసారి ఆ పురణాలు దాటొచ్చి చూడు…అవసరాలు కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు. విలన్లు లేరీ నాటకంలో అంటూ సాయికుమార్ శర్వానంద్ తో చెప్పే డైలాగ్స్ . సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఓ విధమైన భావోద్వేగానికి గురిచేస్తాయి. ఈ సినిమాలో ఇలాంటి ఎన్నో డైలాగులు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తాయి. శర్వానంద్, సందీప్ కిషన్ నటన అత్యుత్తమస్థాయిలో ఉంటుంది.
సినిమా విడుదలై ఏడేళ్లయినా…ఇప్పటికీ ఎవరో ఒకరు ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. తెలుగులో అంతగా ముద్రవేసిన ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్‌నూ ఆకర్షించింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్…ప్రస్తానాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తూ…నటించాలని కోరుకుంటున్నారు.
దేవకట్టతో సంప్రదింపులు జరిపిన తరువాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని సంజయ్ దత్ తెలిపారు. ప్రస్తుతం సంజయ్ భూమి చిత్రంలో నటిస్తున్నారు. విభిన్న కథాంశంతో వచ్చే సినిమాలకు పెద్ద పీట వేసే బాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్థానం హిందీలో రీమక్ చేస్తే తప్పకుండా ఘన విజయం అందిస్తారంటున్నారు సినీ విమర్శకులు. హిందీలో విజయం సాధించటం తో పాటు అనేక అవార్డులు కూడా ఈ సినిమా దక్కించుకునే అవకాశముందని భావిస్తున్నారు. సాధారణంగా దక్షిణాదిన హిట్టయిన సినిమాలను చాలా తొందరగా హిందీలో రీమేక్ చేస్తుంటారు. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు అనేకం వెనువెంటనే హిందీలో రీమేక్ అయి విజయాలు సాధించాయి కూడా. కానీ ప్రస్థానం కమర్షియల్ హిట్ గా నిలవకపోవటం వల్లో. మరే కారణం చేతనో గానీ.. బాలీవుడ్ దృష్టిలో పడటం ఆలస్యమయింది.
మరిన్ని వార్తలు: