నాగార్జున, నానిలు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాలతో ఎదురు చూసిన టీజర్ విడుదలైన తర్వాత అభిమానులు కాస్త పర్వాలేదు అంటున్నా, సాదారణ ప్రేక్షకులు మాత్రం ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది అంటున్నారు. సినిమా ఫస్ట్‌లుక్ నుండి కూడా హీరోలు ఇద్దరు కూడా తాగుబోతు అన్నట్లుగా చూపిస్తున్నారు. టీజర్‌లో కూడా అదే విధంగా చూపించే ప్రయత్నం చేశారు. టీజర్‌లో కేవలం ఒకే షాట్‌ను చూపించడం, చాలా సింపుల్‌గా ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నాగార్జున, నానిలు కలిసి ఉన్న ఈ టీజర్‌లో నాని తెలిసో, తెలియకో రా తాగడం చేస్తాడు. దాంతో షాక్ అయిన నాగార్జున అలా చూస్తూ ఉండి పోతాడు. అమాయకుడు అయిన నాని ఎందుకు ఇంతగా మందుకు అలవాటు అయ్యాడు అనేది సినిమా కాన్సెప్ట్ అయ్యి ఉంటుంది. కాని ప్రేక్షకులు మాత్రం టీజర్‌లో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది అంటున్నారు. త్వరలో చిత్రం నుండి మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇక చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుతున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేయాలి అంటూ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.