Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెటర్ ధోనీ కూతురు జీవా ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు ధోనీ, సాక్షిసింగ్ లు జీవా… ముద్దుముద్దుగా మట్లాడే మాటలను వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సాక్షిసింగ్… జీవా ముద్దులొలికిస్తూ… ఓ మలయాళం భక్తి గీతం పాడిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వైరల్ గా మారిన ఈ పాట చూసి కేరళ వాసులు ఫిదా అయ్యారు. జీవాను ప్రశంసిస్తూ అనేక కామెంట్లు చేశారు. జీవా పాడింది భక్తి గీతం కావడంతో కేరళ అంబాలపుర ప్రాంతంలోని శ్రీకృష్ణ దేవాలయం నిర్వాహకులకు ఆ పాట తెగ నచ్చేసింది.
మామూలుగా పిల్లలందరూ సినిమా పాటలు ఎక్కువగా పాడుతుంటారు. అలాంటిది జీవా… భక్తి గీతాన్ని మలయాళంలో పాడడంతో ఆమెను గౌరవించాలని నిర్ణయించుకున్నారు. జనవరి 14న తమ ఆలయంలో జరిగే కృష్ణుడిపండగకు ప్రత్యేక అతిథిగా రావాలని జీవాకు ఆహ్వానం పంపారు. జీవా పాడిన పాట 1992లో వచ్చిన మలయాళ చిత్రం అద్వైతం సినిమాలోనిది. మలయాళీ అయిన జీవా అమ్మమ్మ షీలా మనవరాలికి ఈ పాట నేర్పించినట్టు తెలుస్తోంది.