Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జున ద్విపాత్రాభినయం చేసి రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఆ చిత్రంతో దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ పరిచయం అయిన విషయం తెల్సిందే. సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలోని బంగార్రాజు పాత్రకు మంచి పేరు వచ్చింది. నాగార్జున బంగార్రాజు పాత్రను అద్బుతంగా చేశాడంటూ ప్రశంసలు దక్కాయి. ఆ పాత్ర బేస్ చేసుకుని పూర్తి చిత్రాన్ని చేస్తే ఖచ్చితంగా బాగుంటుందని సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని నాగార్జున కూడా పరిగణలోకి తీసుకుని బంగార్రాజు చిత్రాన్ని చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మంచి కథతో వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ అప్పుడు పేర్కొన్నాడు.
‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం తర్వాత దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రెండవ సినిమాగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు మంచి పేరు వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం కళ్యాణ్ కృష్ణ మూడవ సినిమా ‘బంగార్రాజు’ అవ్వాలి. కాని తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రవితేజ మూడవ చిత్రం త్వరలో రవితేజ హీరోగా తెరకెక్కబోతుంది. అందుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లుగా కళ్యాణ్ ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడని, అందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
రవితేజతో కళ్యాణ్ కృష్ణ మూవీ కన్ఫర్మ్ అయితే ఇక నాగార్జునతో ‘బంగార్రాజు’ చిత్రం లేనట్లే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సోగ్గాడే చిత్రం వచ్చి చాలా రోజులు అయ్యింది. బంగార్రాజు పాత్రను అంతా మర్చి పోతున్నారు. ఆ పాత్రను బేస్ చేసుకుని సినిమా తీయాలంటే సంవత్సరం లోపులోనే మొదులు పెట్టాల్సింది. కాని ఇంకా కూడా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బంగార్రాజు చిత్రం కోసం దాదాపు పది పదిహేను స్టోరీ లైన్స్‌ను దర్శకుడు నాగార్జునకు వినిపించాడు. కాని నాగార్జున ఏ ఒక్కదాంతో కూడా సంతృప్తి చెందలేదు. దాంతో ఇక ఆ సినిమాను కళ్యాణ్ కృష్ణ వదిలేసినట్లుగా తెలుస్తోంది. రవితేజతో సినిమా సక్సెస్ అయితే అప్పుడు నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడేమో చూడాలి.