Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ, కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేలటిక్కెట్టు’ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయింది. ఒక మూస కథ, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమాకు కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయంటూ స్వయంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు కొందరు మా సినిమా సూపర్ హిట్ అని, సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది అంటూ ఆకాశానికి ఎత్తేలా కామెంట్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
ఆ వీడియోలో సినిమాపై బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. కాని రివ్యూస్ చూసి మోసపోవద్దని, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని, ఎక్కువ శాతం జనాలు సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు అంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ ఓనర్లు చెబుతున్నారు. సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని మొదటి నాలుగు రోజుల పాటు వచ్చిన కలెక్షన్స్‌తో తాము పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యిందని వారు చెబుతున్నారు. సినిమా పోయినప్పుడు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం చాలా కామన్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి జిమ్మిక్కులకు ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేలటిక్కెట్టు చిత్రం కనీసం కలెక్షన్స్‌ను కూడా రాబట్టలేక పోవచ్చు అంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు వృదా ప్రయత్నం అని అంతా అంటున్నారు.